
సాక్షి, వైఎస్సార్ కడప: ధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీలో జరుగుతుందని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేవలం రెండు పేజీల్లో యూనిక్‌గా నవరత్నాల అమలకు.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నాంది పలికారని తెలిపారు. ఆదేవిధంగా జగన్‌మోహన్‌రెడ్డిని ప్రకృతి ఆశీర్వదించిదని, వాతావరణం పులకరించి.. అన్ని డ్యాంలు నిండు కుండలా ఉన్నాయన్నారు. కాగా తొట్టిగ్యాంగ్ పార్టీ అయిన టీడీపీ... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ‘70 ఏళ్లు ఉన్నాయి. పెద్ద మనిషివి కొంచెం మైండ్ పెట్టు. పదేళ్ల వెనక్కి వెళ్లావు’ అంటూ పరోక్షంగా చంద్రబాబుపై కొరముట్ల విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment