బీజింగ్ : ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను చైనా ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తోంది. చైనా రాజధాని నగరం బీజింగ్‌లోనే లక్షా 12 వేలకు పైగా ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వం కూడా ఓ యాప్‌ను కూడా లాంచ్ చేసింది. దాని వల్ల డ్రైవర్లకు దగ్గరలో ఎక్కడ ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయో తెలుస్తోంది. చైనాలో క్రమేపీ విద్యుత్ వాహనాలు పెరగడంతో చార్జింగ్ స్టేషన్లను కూడా పెంచవలసి వస్తోంది. కనీసం 50 లక్షల విద్యుత్ వాహనాలకు సరిపోయేలా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును పంచవర్ష ప్రణాళిక(2016-2020) లక్ష్యాల్లో పెట్టుకుంది.
అలాగే వాహన తయారీదారులు 2019 నుంచి కనీసం 10 శాతం విద్యుత్ వాహనాలు విడుదల చేసే విధంగా మార్గదర్శకాలు రూపొందించింది. క్రమేపీ విద్యుత్ వాహనాల తయారీ పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను నిషేధిస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెల్సిందే. ప్రకటన వెలువడిన 11 నెలల నుంచి చైనాలో ఇప్పటి వరకు విద్యుత్ వాహనాలు వాడకం 6 లక్షల యూనిట్లకు చేరుకుంది. దానికి తగ్గట్టే ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల కొనుగోలు పై సబ్సిడీ కూడా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment