లక్ష్మణచాంద ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
లక్ష్మణచాంద(నిర్మల్): అందరికీ అవసరమయ్యే ఔషధాల పేర్లను ప్రభుత్వం మాతృభాలోనే ముద్రిస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలై ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి తెలుగులో ముద్రించిన మందులు వస్తున్నాయి.
తప్పిన ఆంగ్ల తిప్పలు..
చరిత్రలోనే నేటి వరకు ఔషధాల పేర్లు తెలుగులో ముద్రించిన దాఖలాలు లేవు. వైద్యులు మందుల చిట్టీపై ఆంగ్లంలో మందులు రాస్తే ఎవరికీ అర్థం కాని స్థితిలో ఉండేది. ప్రభుత్వం అందరికీ అర్థమయ్యలా రాయాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మందులు కూడా తెలుగులో ముద్రితమై వస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మందుల పేర్లు అన్ని తెలుగులోనే ముద్రించాలని నిబంధన విధించిం ది. మాత్రలు, మందు సీసాలపై తెలుగులోనే ఔ షధ ఫార్ములా ముద్రించారు. అందువల్ల వైద్యులు కూ డా తప్పనిసరిగా జనరిక్ నామం రాయకతప్పడం లేదు.
వైద్య, ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టి వల్ల
నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టిని సారించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఇతరత్రా సౌకర్యాలను కల్పిస్తోంది. అలాగే ఔషధాల దుర్వినియోగం కాకుండా మందులను ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తోంది. తాజాగా ఔషధాల పేర్లు తెలుగులో ముద్రించడం ద్వారా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లయిందని ప్రజలు పేర్కొంటున్నారు.
50 కంపెనీలు 500 రకాల ఔషధాలు..
ప్రభుత్వం ఇప్పటి వరకు అన్ని జిల్లాలోని జిల్లా ఆస్పత్రులకు, ప్రాథమిక ఆస్పత్రులకు 50 కంపెనీలకు చెందిన 500 రకాల మందులను సరఫరా చేస్తోంది. ఇందులో సాధారణ వ్యాధుల మందులతో పాటు ధీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే మందులు, వివిధ రకాల సిరప్‌లు, ఆయింట్‌మెంట్‌లు ఉన్నాయి.
మందులపై అవగాహన పెరిగింది..
ఇంతకు ముందు మందుల పేర్లు ఆంగ్లంలో ఉండేవి. దీంతో మాలాంటి సామాన్యులకు అవేమీ అర్థం కాకపోయేవి. పలుకుదామంటే నోరు తిరిగేది కాదు. కానీ ప్రభుత్వం తెలుగులో మందుల పేర్లు ముద్రించడంతో మందులపై అవగాహన పెరిగింది.
– మోహన్, తిర్పెల్లి
సామాన్యులకు మేలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు చాలా వరకు మేలు జరిగింది. తెలుగులో మందుల పేర్లు ముద్రించడంతో వారే మందుల తెలుసుకుంటున్నారు.
– మనోజ్ఞ, వైద్యులు, లక్ష్మణచాంద
Comments
Please login to add a commentAdd a comment