పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి
చెన్నూర్ : ప్రభుత్వం బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌లు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వం తొలగించిన అంగన్‌వాడీ కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కషి చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీలను శనివారం అంగన్‌వాడీలు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడారు. ప్రభుత్వానికి ఏ ఉద్యోగిని తొలగించాలనే ఉద్దేశం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తే వేటు పడుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, ఎంపీపీ మైదం కళావతి, సర్పంచ్ సాధనబోయిన కష్ణ, ఎంపీడీవో మల్లేశం, సీడీపీవో మనోరమ, వేమనపల్లి జెడ్పీటీసీ సంతోశ్‌కుమార్, సూపర్‌వైజర్లు పవిత్ర, భారతి, సల్మా, నిర్మల పాల్గొన్నారు.