కొత్త పంచాయతీ కానున్న నర్సంపల్లి గ్రామం
ఊర్కొండ : రాష్ట్ర ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చేందుకు ఆదేశా లు జారీచేయడంతో మండల స్థాయిలో తండాలపై కసరత్తు జరుగుతుంది. ఈ విషయంపై ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పం చాయతీ కార్యదర్శులు, ఆయా తండా ల్లో పర్యటించి గిరిజనుల అభిప్రాయా లు తెలుసుకున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మండలంలో ప్ర స్తుతం 12 గ్రామ పంచాయతీల ద్వారా మరో 5 కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. అన్ని పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. మండల అధికారులు, 5 గ్రా మ పంచాయతీల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గ్రామ పంచా యతీ ఏర్పడటానికి జనా భా, రెవెన్యూ, గ్రామాల మధ్య దూరం, సమానంగా గ్రామ నక్షను అధికారులు అందించారు.
ఇవే 5 కొత్త గ్రామాలు..
మండలంలోని ఠాగూర్‌తండా, బాల్యలోక్‌తండా, తిమ్మన్నపల్లి, నర్స ంపల్లి, గుణగుంట్లపల్లి గ్రామాలను కొత్త గా ఏర్పడే పంచాయతీలకు ప్రతిపాదన లు పంపారు. ఇది వరకు ఊర్కొండపేట పంచాయతీలో ఉన్న గుణగుంట్లపల్లి, జంగాలకాలనీ, రెడ్యాతండాలను కలిపి గుణగుంటపల్లి పం చాయతీగా ఏర్పాటు కానుంది. నర్సంపల్లి ప్రత్యేక పంచాయతీ, రేవల్లి గ్రామ ంలో ఉన్న తిమ్మన్నపల్లిని ప్రత్యేక పం చాయతీ కానుంది. ఠాగూర్‌తండా, బూర్వానికుంట, మఠంతండా, అమ్మపల్లి తండాలను కలుపుతూ ఒక పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. బాల్యలోక్‌తండా, బావాజీతండాలను కలుపుతూ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు మండల స్థాయి అధికారులు ప్రతిపాదనలు అందించారు.
రోడ్డెక్కిన గిరిజనులు..
ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మండలంలోని ఊర్కొండపేట పం చాయతీ పరిధిలోని నాలుగు తం డాలు అమ్మపల్లితండా, బూర్వా నికుంట తండా, మఠంతండా, ఠాగూర్‌తండాలను కలుపుతూ పంచాయ తీగా ఏర్పాటు చేయాలని అధికారు లు ప్రతిపాదనలు పంపించారు. అయితే అమ్మపల్లితండా, ఠాగూర్‌తండా వాసులు తమ తండాలను ఒ క పంచాయతీగా చేయాలని కోరు తూ రోడ్డెక్కారు. రెండు తండాలవాసులు మంత్రులు, జిల్లా అధికారులను సైతం కలిసినట్లు సమాచారం.
సమస్యలు తీరుతాయి..
ఎన్నో ఏళ్లుగా గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం సంతోషం. తండావాసులు గ్రామాలకు వెళ్లాలంటే చాలా సమయం పట్టేది. ఇప్పుడు నూతన పంచాయతీలతో సమస్యలు తొలగుతాయి. పాలన సక్రమంగా అందుతుంది.
– రమేష్‌నాయక్, రెడ్యాతండా
అభివృద్ధి చెందుతుంది..
గత కొన్నేళ్లుగా మా తండా వేరే పంచాయతీలో ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం మా గ్రామంపై చిన్నచూపు చూసేవారు. ఇప్పుడు నూతన పంచాయతీ ఏర్పాటు కావడం వల్ల గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది.
– రాధాకృష్ణ, తిమ్మన్నపల్లి
Comments
Please login to add a commentAdd a comment