Girijans
-
అడవి బిడ్డలకు ఆర్థిక భరోసా
పార్వతీపురం టౌన్: ఆరు దశాబ్దాల కిందటి వరకూ గిరిజనులు నిలువు దోపిడీకి గురయ్యేవారు. గిరిజనులు పండించే పంటను మైదాన ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే కొనుగోలు చేసి వారి శ్రమను దోచుకునేవారు. గిరిజన గూడాల్లో జీసీసీలు ఏర్పడే వరకూ ఇదే తంతు సాగగంతో ఆర్థికంగా వారి బతుకులు కుదేలయ్యాయి. అయితే ఇప్పుడు గిరిజనుల సంపదకు వారే యజమానులు. గిరిజనుల నుంచి మద్దతు ధరకు ముడిసరుకును జీసీసీ (గిరిజన సహకార సంస్థ) కొనుగోలు చేస్తుండడంతో వారి మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఇలా కొనుగోలు చేసిన సరుకులను మరింత నాణ్యమైన ఉత్పత్తులుగా మలిచి జీసీఎంఎస్ (గిరిజన్ కార్పొరేషన్ మార్కెటింగ్ సొసైటీ) ద్వారా జనం చెంతకు జీసీసీ(గిరిజన సహకార సంస్థ) చేర్చుతోంది. తక్కువ ధరలకే విక్రయిస్తూ అటు వినియోగ దారులు, ఇటు గిరిజనులకు లాభాల వారధిగా నిలుస్తోంది. దళారుల బారినుంచి గిరిజనులను కాపాడుతూ అధిక ఆదాయం అర్జించి పెడుతూ ఏటా రూ.కోట్ల విలువైన వ్యాపారం సాగిస్తోంది. ఉత్పత్తులు ఇలా.. గిరిజనుల నుంచి తేనె, చింతపండు, నరమామిడి వంటి దాదాపు 26 రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను ఏటా జీసీసీ కొనుగోలు చేసి 70 కేంద్రాల్లో నిల్వచేస్తోంది. ఏడు పారిశ్రామిక సదుపాయాల్లో ప్రాసెసింగ్ అనంతరం ఉత్పత్తులను మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవడమే జీసీసీ లక్ష్యం. పసుపు, కుంకుమ, తేనె, షరబత్, షాంపూలు, సబ్బులు, కాఫీ పొడి తదితర 27 ఉత్పత్తులను రిటైల్‌గా ప్రత్యేక ఔట్లెట్లు, సూపర్ బజార్లు, రైతుబజార్లు, ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పరిసర గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్ పెట్టి విక్రయాలు నిర్వహించడమే కాకుండా మొబైల్ సేవలను కూడా ప్రారంభించింది. మారుమూల పల్లెలకు గిరిజన ఉత్పత్తులను చేరవేస్తోంది. గిరిజనులకు ఆర్థిక ఊతం ప్రకృతి సిద్ధమైన గిరిజన ఉత్పత్తులు దళారుల పాలవకుండా మైదాన ప్రాంతాల ప్రజలకు చేరువ చేసేందుకు జీసీఎంఎస్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాం. రానున్న రోజుల్లో గిరిజన ఉత్పత్తులను ప్రజలందరికీ చేరువచేసే ప్రణాళిక సిద్ధం చేశాం. గిరిజనులకు ఆర్థిక ఊతం కల్పిస్తాం. ముడిసరుకులకు మద్దతు ధరకల్పిస్తాం. - శోభా స్వాతిరాణి, చైర్పర్సన్, జీసీసీ ప్రతి గ్రామానికి చేరువ చేస్తాం జీసీఎంఎస్‌కు మరింత ఆదాయం చేకూరేలా ఉత్పత్తులను గ్రామ స్థాయి ప్రజలకు అందించేందు మొబైల్ సేవలు ప్రారంభించాం. దీనివల్ల గిరిజనులు లబ్ధిపొందడమే కాకుండా ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతి గ్రామానికి జీసీఎంఎస్ ఉత్పత్తులు సరఫరా అయ్యేలా మొబైల్ సేవలను విస్తృతం చేస్తాం. - డి. సురేంద్ర కుమార్, జీసీసీ డివిజనల్ మేనేజర్ పార్వతీపురం ఆరోగ్యకర ఉత్పత్తులు స్వచ్ఛమైన ముడి సరుకుల తో ప్రజారోగ్యానికి ఎటు వంటి హాని కలిగించని ఉత్పత్తులను జీసీఎంఎస్ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నాం. ఆరోగ్యానికి మేలుచేసే ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రం పార్వతీపురం పరిధిలో నాలుగు స్టాల్స్‌తో పాటు మొబైల్ వాహన సేవలు ప్రారంభించాం. - సాంబశివరావు, సీనియర్ అసిస్టెంట్, జీసీసీ పార్వతీపురం -
ఆటాడుకుందాం రా..!
భద్రాచలం : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థుల అభివృద్ధి కోసం మరో సరికొత్త కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుడుతున్నారు. గురుకుల సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఇది రూపుదిద్దుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గురుకులాల్లో 22 చోట్ల మినీ అకాడమీలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తగిన తర్ఫీదు ఇచ్చే క్రమంలో క్రీడా మినీ అకాడమీలను ఏర్పాటు చేస్తుండటం గిరిజన సంక్షేమ విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం. దీనిలో భాగంగా ఖమ్మం రీజియన్‌కు 3 చోట్ల మినీ క్రీడా అకాడమీలు మంజూరు కాగా, ఇవి భద్రాద్రి జిల్లాకే కేటాయించటం శుభ పరిణామం. భద్రాచలం, సుదిమళ్ల, కిన్నెరసాని గురుకులాలకు వీటిని మంజూరు చేశారు. భద్రాచలంలోని మినీ అకాడమీని సోమవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గురుకుల సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆ సంస్థ ఖమ్మం రీజియన్ కో ఆర్డినేటర్ ఎస్కే బురాన్ తెలిపారు. అకాడమీ ప్రారంభోత్సవాన్ని వేడుకగా జరిపేందుకు ఒక్కో చోట ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. భద్రాచలంలో ఆర్చరీ, సుదిమళ్లలో బాల్ బ్యాడ్మింటన్, కిన్నెరసాని గురుకులంలో వాలీబాల్ క్రీడలో తర్ఫీదు ఇచ్చేందుకు ఈ అకాడమీలు ఏర్పాటు కాబోతున్నాయి. చదువులతో పాటే క్రీడలు... గురుకులాల్లో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మినీ అకాడమీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థులకు చదువుతో పాటు, వారికి ఆసక్తి ఉన్న ఆటలో శిక్షణ ఇచ్చి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఈ అకాడమీల్లో తర్ఫీదు ఇస్తారు. ఇందకోసం ఆయా అకాడమీకి ఎంపిక చేసిన క్రీడాంశంలో నైపుణ్యం గల ఫిజికల్ డైరెక్టర్‌ను కేటాయిస్తారు. ఒక్కో అకాడమీలో 20 నుంచి 25 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 147 గురుకులాల నుంచి ఆయా క్రీడల్లో ఆసక్తి, రాణించే విద్యార్థులను ఎంపిక చేసి అకాడమీలకు పంపించేలా ఏర్పాట్లు చేశారు. అడ్మిషన్ పొందిన గురుకులంలోనే విద్యార్థి పేరు నమోదవుతుంది. అయితే ఆయా క్రీడకు సంబంధించిన అకాడమీ ఎక్కడ ఉంటే అక్కడికెళ్లి చదవాల్సి ఉంటుంది. గిరిజన విద్యార్థులకు ఎంతో మేలు... ఖమ్మం రీజియన్ పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు కలిపి 26 విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే భద్రాద్రి జిల్లాలోనే 21 విద్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం రీజియన్‌కు మంజూరైన 3 అకాడమీలను జిల్లాకు కేటాయించారు. జిల్లాలో ఇప్పటికే పాల్వంచ మండలం కిన్నెరసానిలో ఆర్చరీకి సంబంధించిన శిక్షణ అందుబాటులో ఉంది. ఇక్కడ తర్ఫీదు పొందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ప్రస్తుతం భద్రాచలం గురుకులంలో శాశ్వతంగా అకాడమీని ఏర్పాటు చేస్తుండటంతో తురుఫు ముక్కల్లాంటి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంది. గిరిజన విద్యార్థులకు దీంతో ఎంతో మేలు చేకూరనుంది. విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్... గురుకులాల్లో మినీ అకాడమీలను ఏర్పాటు చేసు ్తన్న నేపథ్యంలో ఆయా చోట్ల ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డ్రెస్‌లను ఆయా గురుకులాలకు సరఫరా చేశారు. షూస్, ట్రాక్ షూ కూడా అందజేస్తారు. ఇందుకోసం ప్రతీ గురుకులానికి రూ. 50 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. భద్రాచలం వంటి పాఠశాలలకు బ్యాండ్ సెట్ అదనంగా సరఫరా చేశారు. విద్యార్థుల టూకే రన్.. గురుకులాల్లో మినీ అకాడమీలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో ఆదివారం విద్యార్థులు టూకే రన్ నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం నుంచి చర్ల రహదారి వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. -
తండాలకు మహర్దశ!
ఊర్కొండ : రాష్ట్ర ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చేందుకు ఆదేశా లు జారీచేయడంతో మండల స్థాయిలో తండాలపై కసరత్తు జరుగుతుంది. ఈ విషయంపై ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పం చాయతీ కార్యదర్శులు, ఆయా తండా ల్లో పర్యటించి గిరిజనుల అభిప్రాయా లు తెలుసుకున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మండలంలో ప్ర స్తుతం 12 గ్రామ పంచాయతీల ద్వారా మరో 5 కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. అన్ని పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. మండల అధికారులు, 5 గ్రా మ పంచాయతీల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గ్రామ పంచా యతీ ఏర్పడటానికి జనా భా, రెవెన్యూ, గ్రామాల మధ్య దూరం, సమానంగా గ్రామ నక్షను అధికారులు అందించారు. ఇవే 5 కొత్త గ్రామాలు.. మండలంలోని ఠాగూర్తండా, బాల్యలోక్తండా, తిమ్మన్నపల్లి, నర్స ంపల్లి, గుణగుంట్లపల్లి గ్రామాలను కొత్త గా ఏర్పడే పంచాయతీలకు ప్రతిపాదన లు పంపారు. ఇది వరకు ఊర్కొండపేట పంచాయతీలో ఉన్న గుణగుంట్లపల్లి, జంగాలకాలనీ, రెడ్యాతండాలను కలిపి గుణగుంటపల్లి పం చాయతీగా ఏర్పాటు కానుంది. నర్సంపల్లి ప్రత్యేక పంచాయతీ, రేవల్లి గ్రామ ంలో ఉన్న తిమ్మన్నపల్లిని ప్రత్యేక పం చాయతీ కానుంది. ఠాగూర్తండా, బూర్వానికుంట, మఠంతండా, అమ్మపల్లి తండాలను కలుపుతూ ఒక పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. బాల్యలోక్తండా, బావాజీతండాలను కలుపుతూ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు మండల స్థాయి అధికారులు ప్రతిపాదనలు అందించారు. రోడ్డెక్కిన గిరిజనులు.. ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మండలంలోని ఊర్కొండపేట పం చాయతీ పరిధిలోని నాలుగు తం డాలు అమ్మపల్లితండా, బూర్వా నికుంట తండా, మఠంతండా, ఠాగూర్తండాలను కలుపుతూ పంచాయ తీగా ఏర్పాటు చేయాలని అధికారు లు ప్రతిపాదనలు పంపించారు. అయితే అమ్మపల్లితండా, ఠాగూర్తండా వాసులు తమ తండాలను ఒ క పంచాయతీగా చేయాలని కోరు తూ రోడ్డెక్కారు. రెండు తండాలవాసులు మంత్రులు, జిల్లా అధికారులను సైతం కలిసినట్లు సమాచారం. సమస్యలు తీరుతాయి.. ఎన్నో ఏళ్లుగా గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం సంతోషం. తండావాసులు గ్రామాలకు వెళ్లాలంటే చాలా సమయం పట్టేది. ఇప్పుడు నూతన పంచాయతీలతో సమస్యలు తొలగుతాయి. పాలన సక్రమంగా అందుతుంది. – రమేష్‌నాయక్, రెడ్యాతండా అభివృద్ధి చెందుతుంది.. గత కొన్నేళ్లుగా మా తండా వేరే పంచాయతీలో ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం మా గ్రామంపై చిన్నచూపు చూసేవారు. ఇప్పుడు నూతన పంచాయతీ ఏర్పాటు కావడం వల్ల గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. – రాధాకృష్ణ, తిమ్మన్నపల్లి -
12 ఇళ్లు దగ్ధం: రూ.5 లక్షల నష్టం
సాక్షి, మెంటాడ: విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. కూనేరు పంచాయతీ పరిధిలోని రేగిలపాడు గిరిజన గ్రామంలో 12 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. గిరిజన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. సహాయం చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
ఇద్దరు గిరిజనులను చంపిన మావోయిస్టులు
-
ఇద్దరు గిరిజనులను చంపిన మావోయిస్టులు
విశాఖపట్నం: జిల్లాలోని జి.మాడుగుల మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్దిగరువు సమీపంలో మావోయిస్టులు ఇద్దరు గిరిజనులను హతమార్చారు. ఇన్ఫార్మర్ల నెపంతో వీరిని కాల్చి చంపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను నుర్య, కిశోర్‌గా గుర్తించారు. -
ఇద్దరిని నరికి చంపిన మావోయిస్టులు
ఒడిశా: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. బుధవారం అర్ధరాత్రి కన్నగూడలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. సదరు గిరిజన యువకులు పోలీసులకు మావోయిస్టుల సమాచారం అందజేస్తున్నట్లుగా భావించారు. ఆ క్రమంలో వారని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నించారు. తమకు ఏమీ తెలియదని వారు మావోయిస్టులకు చెప్పారు. కానీ మావోయిస్టులు గత అర్థరాత్రి వారిద్దరిని నరికి చంపారు.