కడప: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివక్ష పూరితమైన పాలనకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కడప జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా పోయిందని అన్నారు.
సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పంటలు ఎండిపోతున్నా సాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించిన నేతలు జిల్లాకు తక్షణమే నికర జలాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.