
సాక్షి, హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కేంద్రంగా సాగిన వ్యభిచారంతో సంబంధమున్న వారిని సమాజ బహిష్కరణ చేయాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కూపంలోకి చిన్నారులను సైతం దించడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, దీనిపై సీఎం జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో సమీక్షించాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఖమ్మంలో హ్యాపీ ఫ్యూచర్ మల్టీపర్పస్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో మహ్మద్ రఫీ అనే వ్యక్తి రూ.100 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని, దీనిపై సీబీసీఐడి దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment