సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిర్ధారణ కిట్ల (డయాగ్నొస్టిక్ కిట్ల) ఎగుమతులపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని శనివారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోఈ కిట్ల అవసరం చాలా వుందని పేర్కొంది. డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతి (డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్ బ్యాకింగ్, ప్రిపరేషన్ డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్) ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు. మరోవైపు కరోనావైరస్ నిరోధంలో అవసరమైన రక్షణ పరికరాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కాగా కోవిడ్-19 సంక్షోభంలో కీలక సేవలందిస్తున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరతకు ప్రధాన సమస్యగా మారింది. కరోనా వైరస్ విస్తరిస్తున్ననేపథ్యంలో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిరకాల పాత్ర చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా 386 కేసులతో మహారాష్ట్ర, తమిళనాడు తరువాత దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు దేశంలో మూడవ స్థానంలో ఉంది. దేశ రాజధానిలో 7000-8000 పీపీఏ కిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి చెప్పారు. అలాగే అత్యవసరంగా 50 వేల కిట్లను ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కోవిడ్-19 కేసులు 3వేలకు సమీపంలో ఉండగా, 2,650 క్రియాశీల కేసులు నమోదయ్యాయి.183 మంది కోలుకోగా 68 మరణాలు సంభవించాయి. (వాట్సాప్ హ్యాకింగ్ : జర భద్రం) (లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది)
Comments
Please login to add a commentAdd a comment