diagnostic kits
-
మంకీపాక్స్ నిర్ధారణ కిట్ విడుదల
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రపంచాన్ని కలవర పెడుతున్న మంకీపాక్స్ వైరస్‌ను నిర్ధారించే కిట్ అందుబాటులోకి వచ్చింది. విశాఖలోని మెడ్ టెక్ జోన్లో ట్రాన్సాసియా బయో–మెడికల్స్ సంస్థ ఆర్టీపీసీఆర్ విధానంలో ఈ కిట్‌ను అభివృద్ధి చేసింది. స్వదేశంలో తయారైన మొట్టమొదటి మంకీపాక్స్ నిర్ధారణ కిట్ ఇదే కావడం విశేషం. ట్రాన్సాసియా–ఎర్బా పేరుతో తయారు చేసిన ఈ కిట్‌ను కేంద్రంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్‌కుమార్ సూద్ శుక్రవారం మెడ్‌టెక్ జోన్లో ఆవిష్కరించారు. అత్యంత సున్నితమైన, కచ్చితమైన ఫలితం కోసం ఈ కిట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుందని ట్రాన్సాసియా వ్యవస్థాపక చైర్మన్ సురేష్ వాజిరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ బలరాం భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారుడు అల్క శర్మ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: 13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి.. యాంకర్‌గా అదరగొడుతున్న అభిషేక్ ) -
కరోనా : వాటి ఎగుమతులపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిర్ధారణ కిట్ల (డయాగ్నొస్టిక్ కిట్ల) ఎగుమతులపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని శనివారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోఈ కిట్ల అవసరం చాలా వుందని పేర్కొంది. డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతి (డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్ బ్యాకింగ్, ప్రిపరేషన్ డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్) ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపారు. మరోవైపు కరోనావైరస్ నిరోధంలో అవసరమైన రక్షణ పరికరాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా కోవిడ్-19 సంక్షోభంలో కీలక సేవలందిస్తున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరతకు ప్రధాన సమస్యగా మారింది. కరోనా వైరస్ విస్తరిస్తున్ననేపథ్యంలో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిరకాల పాత్ర చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా 386 కేసులతో మహారాష్ట్ర, తమిళనాడు తరువాత దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు దేశంలో మూడవ స్థానంలో ఉంది. దేశ రాజధానిలో 7000-8000 పీపీఏ కిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి చెప్పారు. అలాగే అత్యవసరంగా 50 వేల కిట్లను ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కోవిడ్-19 కేసులు 3వేలకు సమీపంలో ఉండగా, 2,650 క్రియాశీల కేసులు నమోదయ్యాయి.183 మంది కోలుకోగా 68 మరణాలు సంభవించాయి. (వాట్సాప్ హ్యాకింగ్ : జర భద్రం) (లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది) -
ఇక సులువుగా ‘కరోనా’ నిర్ధారణ!
న్యూఢిల్లీ : దేశంలో ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించే 18 రకాల పరీక్షల కిట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో మూడు రకాల కిట్లను పుణేలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ వైరాలజి’ తయారు చేయగా, మిగతా 15 కిట్లకు ఇతర దేశాలు ఇచ్చిన లైసెన్సులు, సర్టిఫికెట్ల ఆధారంగా భారత్ ప్రభుత్వం సత్వర అనుమతి మంజూరు చేసింది. ఈ 18 రకాల కిట్ల తయారీకి, మార్కెటింగ్‌కు అనుమతి మంజూరు చేసినట్లు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ వీజీ సోమని మీడియాకు తెలియజేశారు. ఇంతవరకు ఇలాంటి కిట్లు చాలినన్నీ అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కేవలం 26 వేల మందికి మాత్రమే కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగలిగారు. అందుకే వీటికి కేంద్రం సత్వర అనుమతిని మంజూరు చేయాల్సి వచ్చింది. 18 కిట్లలో 15 కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కూడా కేంద్రం అనుమతించినట్లు వీజీ సోమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (చదవండి: కరోనా నిర్ధారణ నిమిషాల్లోనే!) కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోకి వచ్చే భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పర్యవేక్షణలోనే దేశంలో ఇంతవరకు కరోనా నిర్ధారిత పరీక్షలను నిర్వహిస్తూ వచ్చారు. వాటిని కూడా తొలుత పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరిమితం చేయడం తీవ్ర జాప్యానికి దారితీసింది. అంతవరకు ప్రభుత్వం అనుమతించిన కరోనా పరీక్షలను పుణే సంస్థనే నిర్వహించాల్సి రావడం ఆలస్యానికి కారణమైంది. ఈ దశలో ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ రంగంలోకి దిగడంతో లైసెన్స్‌ల ప్రక్రియ వేగవంతం అయింది. అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, యురోపియన్ సీఈ సర్టిఫికెట్ ఉన్నట్లయితే తమ దేశంలో ఈ కిట్ల తయారీకి వెంటనే అనుమతి ఇస్తామని, ఇప్పటి వరకు అలాగే ఇచ్చామని వీజీ సోమని తెలిపారు. నిబంధనల ప్రకారం కనీసం 200 మందిపై పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లు పొందాల్సిన విదేశీ కంపెనీలు కేవలం 30 మందిపైనే పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లు పొందాయని, వాటి ప్రామాణికతను శంకించాల్సి వస్తుందని భారతీయ వైద్యులు అభిప్రాయపడ్డారు. (కరోనా: 300 మందిని బలిగొన్న విష ప్రచారం) -
తక్కువ ఖర్చులో కరోనా నిర్ధారణ కిట్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రాథమిక దశలోనే పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. దీనివల్ల కరోనా మహమ్మారిని ప్రారంభంలోనే గుర్తించి ప్రజల ప్రాణాలు కాపాడొచ్చని అంటోంది. డబ్ల్యూహెచ్‌వో పిలుపునకు అనుగుణంగా, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తక్కువ ఖర్చుతో, కచ్చితమైన ఫలితాలు కనుగొనే విధంగా వ్యాధి నిర్ధారక కిట్‌ను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చేందుకు శ్రమిస్తోంది. అంతా సజావుగా సాగితే రెండు, మూడు వారాల్లో మంచి కిట్లు రూపొందించగలమని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కిట్లు నాణ్యమైన విగా, కచ్చితమైన ఫలితాలు ఇచ్చేవిగా ఉండటం అత్యంత ముఖ్యమన్నారు. ఈ కిట్లు వంద శాతం ఫలితాలిచ్చినప్పుడే వాటిని ఆమోదిస్తామన్నారు. అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఖర్చు గురించి కూడా తాము ఆలోచిస్తున్నామని, ఇది రూ.వెయ్యి కంటే తక్కువ ఉండాలన్నది తమ ఆలోచన అని చెప్పారు. రూ.400 నుంచి రూ.500 చౌక కిట్స్ గురించి ఆలోచన కూడా ఉందని, ప్రస్తుతం తాము ఇందుకు హామీ ఇ వ్వలేమని ఆయన చె ప్పారు. అన్నింటి కం టే ముఖ్యమైనది ప్రా మాణికత గల కిట్ అని మిశ్రా చెప్పారు. పరీక్షలు చేసేందుకు సీసీ ఎంబీలో సదుపాయాలున్నాయని, ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందన్నారు. తాము ఇంకా శాంపిళ్లు, కిట్ అందుకోవలసి ఉందని డా క్టర్ మిశ్రా తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన 5 టెస్టింగ్ కేంద్రాలున్నాయి. సీసీఎంబీ 25 మందికి శిక్షణ ఇచ్చింది. దీంతో వీరు ఈ కేంద్రా ల్లో పరీక్షలు చేయడానికి వీలు కలుగుతుంది. కరోనా పరీక్షల సదుపాయం హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, సర్ రోనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ లేదా ఫీవర్ ఆస్పత్రి, వరంగల్ ఆస్పత్రిలో ఉంది. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) కూడా ఈ కేంద్రాల జాబితాలో చేరనుంది. ఇక ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, ఔషధాలు తయారు చేయడం మరో అంశం. ప్రస్తుతానికి వాక్సిన్ లేదా ఔషధాల అభివృద్ధిపై తాము పనిచేయడం లేదని డాక్టర్ మిశ్రా చెప్పారు. -
డెంగీ డేంజర్ ; కిట్లకు కటకట..
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులకు ఇదో పరీక్ష. డెంగీ రోగులకు పరీక్షలు చేయడంలో విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో డెంగీ నిర్ధారణ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరిపడా డెంగీ నిర్ధారణ కిట్లు లేక పాట్లుపడుతున్నాయి. రెండు, మూడు రోజులు ఆగాలని వైద్య సిబ్బంది చెబుతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం డెంగీపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కిట్లు సమకూర్చకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నివేదికలతో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవసరం 10 లక్షలు...అందుబాటులో 1.35 లక్షల మందికే వైరల్ జ్వరాలు విజృంభిస్తుండటం, ఒక్కోసారి 103–104 డిగ్రీల జ్వరం వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా జనం ఆందోళన చెందుతున్నారు. వైరల్ జ్వరాలు, డెంగీ అనుమానిత కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 31 జిల్లా, 87 ఏరియా ఆసుపత్రులకు రోజూ లక్షలాదిమంది తరలివస్తున్నారు. పడకలు కూడా దొరకని పరిస్థితి. ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్‌లోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌కూ రోగులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వేలాది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కూడా డెంగీ నిర్ధారణ కోసం లక్షలాది మంది వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షలమందికి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉండగా, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో కేవలం 1.35 లక్షలమందికి మాత్రమే సరిపడా కిట్లున్నాయి. అందులో ప్రాథమిక నిర్ధారణ కోసం నిర్వహించే ర్యాపిడ్ టెస్టు కిట్లు 73 వేలుండగా, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఎలీసా కిట్లు కేవలం 62 వేలమందికి సరిపోను మాత్రమే ఉన్నాయి. ఎలీసా పరీక్షల కోసం రెండు, మూడు రోజులపాటు ఆగాలని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది చెబుతుండటంతో బాధితులు ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. వైద్య విధాన పరిషత్ యంత్రాంగం విఫలం వైద్య విధాన పరిషత్‌కు ఇన్చార్జి కమిషనర్‌గా హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్ కొనసాగుతున్నారు. రెండు విధులతో ఆయన జిల్లా, ఏరియా ఆసుపత్రులపై దృష్టి సారించడంలేకపోతున్నారు. కనీసం ఆయా ఆసుపత్రుల యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేని పరిస్థితి. ఆయన కంటే కిందిస్థాయిలో ఉండే అధికారులు కూడా డెంగీ నిర్వహణ, పర్యవేక్షణలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలీసా కిట్లు ఏడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకూ అధికారులు డెంగీ నిర్ధారణ కిట్లు తక్కువగానే ఇచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్లను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి 500, దుబ్బాక ఆసుపత్రికి 150, తూప్రాన్ ఆసుపత్రికి 250 మాత్రమే ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి కేవలం ఏడే ఎలీసా కిట్లు ఇచ్చారు. ర్యాపిడ్ పరీక్ష కిట్టు ద్వారా ఒక్కో యూనిట్ ఒక్కరికి, ఎలీసా కిట్టు ఒక్కోటి 96 మందికి పరీక్ష చేయడానికి వీలుంది. నీలోఫర్ ఆసుప త్రికి 70 ఎలీసా కిట్లు మాత్రమే ఇచ్చారు. అయితే, ఇక్కడికి రోజూ కనీసం 2 వేల మందికి పైగా పిల్లలు వస్తున్నారు. హైదరా బాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి రోజూ 2,500 మంది రోగులు వస్తుంటారు. అక్కడ కేవలం 3,936 మందికి సరిపోయే 41 ఎలీసా కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి ఐదు ఎలీసా కిట్లు మాత్రమే ఉన్నాయి. ఆలస్యానికి కారణమిదే.. డెంగీ పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యానికి కారణం కిట్ల కొరత కాదు. అవసరమైనన్ని కిట్లు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరమైనప్పుడు తెప్పిస్తున్నాం. అయితే, ఎలీసా పరీక్షకు నిర్వహించే ఒక్కో కిట్టు ధర రూ.25 వేలు. ఒక్కో కిట్టు ద్వారా 96 మందికి పరీక్షలు చేయడానికి వీలుంది. కొద్దిమంది కోసం ఒక్కసారి కిట్టు విప్పితే మిగతావారి కోసం దాన్ని దాచి ఉంచలేం. కాబట్టి 96 రక్త నమూనాలు వచ్చే వరకు ఆగుతున్నాం. -చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ,టీఎస్ఎంఎస్ఐడీసీ -
అందుబాటులో డెంగీ జ్వర నిర్ధారణ కిట్లు
కడప అర్బన్ : జిల్లాలో డెంగీ జ్వర నిర్ధారణకు అవసరమయ్యే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆరోగ్య కేంద్రం, రిమ్స్‌లో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ‘జిల్లాలో డెంగీ జ్వరాలు-నియంత్రణ, దోమల నివారణ’పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు, వైద్య విధాన పరిషత్ , రిమ్స్, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చ భారత్ కార్యక్రమం ఇంటినుంచే ప్రారంభించాల్సి ఉందన్నారు. క్లస్టర్ల స్థాయిలో కన్వర్జెన్స్ కమిటీ సమావేశాలుఏర్పాటు చేసి డ్రైడే..ఫ్రైడే నినాదాన్ని ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్‌ప్రభుదాస్ మాట్లాడుతూ టైగర్ దోమ వల్ల డెంగీ జ్వరం వస్తుందన్నారు. ఇది పగటిపూట సంచరిస్తూ ఉంటుందని తెలిపారు. అరుుతే అంటువ్యాధి కాదన్నారు. డెంగీ రోగికి కుట్టిన దోమ మరో వ్యక్తికి కుట్టినపుడు ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. మనిషి రక్తంలో రెండు లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 20 వేలకు తగ్గినపుడు మాత్రం అలాంటి రోగికి ప్లేట్లెట్స్ ఎక్కించడం జరుగుతుందన్నారు. రక్తం నుంచి ప్లేట్లెట్స్ సపరేట్ చేయడానికి అవసరమైన పరికరాలు రిమ్స్‌లో ఉన్నాయన్నారు. డెంగీ జ్వరాన్ని తగ్గించడానికి ప్రత్యేకించి ఎలాంటి మందులు అవసరం లేదన్నారు. జిల్లా అదనపు జేసీ సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం,ఐసీడీఎస్ పీడీ లీలావతి, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్, వైద్య విధాన పరిషత్ సమన్వయ అధికారి డాక్టర్ రామేశ్వరుడు, జిల్లా పంచాయతీ అధికారి అపూర్వ సుందరి పాల్గొన్నారు. రక్త కణాలు తగ్గిపోతున్న కేసులే ఎక్కువ ప్రొద్దుటూరు టౌన్: మలేరియా జ్వరాలకంటే రక్త కణాలు తగ్గుతున్న కేసులు ఎక్కువగా వస్తున్నాయని ప్రైవేటు వైద్యులు ఆర్ఎంఓ బుసిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణలకు వివరించారు. మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని సూపర్‌బజార్ రోడ్డులో ఉన్న వైద్యులు రంగారెడ్డి ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి కేసులు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. క్రిటికల్ మలేరియా చాలా తక్కువగా ఉందన్నారు. వైరల్ జ్వరాలు వస్తున్నా ఆ శాతం కూడా చాలా తక్కువగానే ఉందన్నారు. ప్లేట్లేట్స్ తగ్గినవన్నీ డెంగీ కేసులు కావని, మలేరియా, చికున్‌గున్యా, దగ్గుతో కూడిన జ్వరం వచ్చినా ప్లేట్లేట్స్ తగ్గిపోతాయని వైద్యులు వివరించారు.