తక్కువ ఖర్చులో కరోనా నిర్ధారణ కిట్‌!  | Corona Diagnostic Kit For Limited Price Says CCMB | Sakshi
Sakshi News home page

తక్కువ ఖర్చులో కరోనా నిర్ధారణ కిట్‌! 

Published Fri, Mar 27 2020 1:03 AM | Last Updated on Fri, Mar 27 2020 1:03 AM

Corona Diagnostic Kit For Limited Price Says CCMB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రాథమిక దశలోనే పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. దీనివల్ల కరోనా మహమ్మారిని ప్రారంభంలోనే గుర్తించి ప్రజల ప్రాణాలు కాపాడొచ్చని అంటోంది. డబ్ల్యూహెచ్‌వో పిలుపునకు అనుగుణంగా, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తక్కువ ఖర్చుతో, కచ్చితమైన ఫలితాలు కనుగొనే విధంగా వ్యాధి నిర్ధారక కిట్‌ను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చేందుకు శ్రమిస్తోంది. అంతా సజావుగా సాగితే రెండు, మూడు వారాల్లో మంచి కిట్లు రూపొందించగలమని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌కే మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కిట్లు నాణ్యమైన విగా, కచ్చితమైన ఫలితాలు ఇచ్చేవిగా ఉండటం అత్యంత ముఖ్యమన్నారు.

ఈ కిట్లు వంద శాతం ఫలితాలిచ్చినప్పుడే వాటిని ఆమోదిస్తామన్నారు. అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఖర్చు గురించి కూడా తాము ఆలోచిస్తున్నామని, ఇది రూ.వెయ్యి కంటే తక్కువ ఉండాలన్నది తమ ఆలోచన అని చెప్పారు. రూ.400 నుంచి రూ.500 చౌక కిట్స్‌ గురించి ఆలోచన కూడా ఉందని,  ప్రస్తుతం తాము ఇందుకు హామీ ఇ వ్వలేమని ఆయన చె ప్పారు. అన్నింటి కం టే ముఖ్యమైనది ప్రా మాణికత గల కిట్‌ అని మిశ్రా చెప్పారు. పరీక్షలు చేసేందుకు సీసీ ఎంబీలో సదుపాయాలున్నాయని, ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందన్నారు. తాము ఇంకా శాంపిళ్లు, కిట్‌ అందుకోవలసి ఉందని డా క్టర్‌ మిశ్రా తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన 5 టెస్టింగ్‌ కేంద్రాలున్నాయి. సీసీఎంబీ 25 మందికి శిక్షణ ఇచ్చింది. దీంతో వీరు ఈ కేంద్రా ల్లో పరీక్షలు చేయడానికి వీలు కలుగుతుంది. కరోనా పరీక్షల సదుపాయం హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, సర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాఫికల్‌ అండ్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ లేదా ఫీవర్‌ ఆస్పత్రి, వరంగల్‌ ఆస్పత్రిలో ఉంది. సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) కూడా ఈ కేంద్రాల జాబితాలో చేరనుంది. ఇక ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, ఔషధాలు తయారు చేయడం మరో అంశం. ప్రస్తుతానికి వాక్సిన్‌ లేదా ఔషధాల అభివృద్ధిపై తాము పనిచేయడం లేదని డాక్టర్‌ మిశ్రా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement