- తెలంగాణ రాష్ట్ర జువైనల్ బోర్డు సలహాదారురాలు జి.రోషి
స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
Published Sat, Sep 3 2016 9:37 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
జ్యోతినగర్: స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వారు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర జువైనల్ బోర్డు సలహాదారురాలు జి.రోషి అన్నారు. శనివారం ఎన్టీపీసీ రామగుండం సాయి సామాజిక భవనంలో ప్రేమ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ స్వచ్ఛంద సంస్థల శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. ఆశ్రమాలు నిర్వహిస్తున్నవారు పాటించవలసిన అంశాలను తెలియజేశారు. ప్రభుత్వపరంగాఎన్జీవోలకు కలిగే సౌకర్యాలను వివరించారు. ఇష్టానుసారంగా స్వచ్ఛంద సంస్థలను నిర్వహించరాదన్నారు. అనంతరం వృద్ధుల ఆశ్రమానికి మంచాలు, పరుపులను అందజేశారు. ట్రస్టు నిర్వాహకులు స్వప్నా, సీఎస్సార్ డెప్యూటీ మేనేజర్ ఆకుల రాంకిషన్, ఎన్‌వైపీ రాష్ట్ర అధ్యక్షుడు యాదవరాజు, రహమత్‌పాషా, వెంకటేష్, లింగమూర్తి, సాయికృష్ణ, లింగమూర్తి, శ్యాం, ఓంకార్‌తో పాటు వివిధ సంఘాల నిర్వాహకులు పాల్గొన్నారు.
Advertisement