recoganise
-
Covaxin : కేంద్రం ప్రకటన.. గల్ఫ్ వెళ్లేవారికి భరోసా
హైదరాబాద్: కోవాగ్జిన్ తీసుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్న వారికి భరోసా కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కోవాగ్జిన్ టీకా కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జులై 20న రాజ్యసభలో తెలిపారు. తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలు, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కోవాగ్జిన్ గుర్తింపుపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. సందేహాలు ప్రస్తుతానికి గల్ఫ్ దేశాలలో కోవిషీల్డ్ కే గుర్తింపు ఉంది. డబ్ల్యూహెచ్ఓ అనుమతి వస్తేనే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి గల్ఫ్ దేశాలు అనుమతించే అవకాశం ఉంది. దీంతో కోవాగ్జిన్ తీసుకున్న వారు తాము గల్ఫ్ దేశాలకు ఎప్పుడు వెళ్తామో ఏమో అనే సందేహాంలో ఉన్నారు. ఇప్పటికే నెలల తరబడి వర్క్‌కు దూరంగా ఉన్నామని,.. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పులు పాలవుతామని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కేంద్రం చేసిన ప్రకటన వారికి భరోసా కలిగించింది. ఇలాగైతే కష్టం కోవిడ్ ఫస్ట్‌వేవ్ ముగిసిన తర్వాత గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న చాలా మంది భారతీయులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు సెలవులపై ఇంటికి వచ్చారు. వీరిలో చాలా మంది డిసెంబరు నుంచి మార్చి మధ్యలో ఇండియాకు చేరుకున్నారు. అయితే ఆ తర్వాత కోవిడ్ సెకండ్‌వేవ్ మొదలవడంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంతలో ఏప్రిల్ 25 నుంచి భారత్ - గల్ఫ్ దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే జులై 25 నుంచి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వార్తలు వస్తుండటంతో తిరిగి పనులకు వెళ్లేందుకు గల్ఫ్ కార్మికులు సిద్ధమవుతున్నారు. -
స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
తెలంగాణ రాష్ట్ర జువైనల్ బోర్డు సలహాదారురాలు జి.రోషి జ్యోతినగర్: స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వారు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర జువైనల్ బోర్డు సలహాదారురాలు జి.రోషి అన్నారు. శనివారం ఎన్టీపీసీ రామగుండం సాయి సామాజిక భవనంలో ప్రేమ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ స్వచ్ఛంద సంస్థల శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. ఆశ్రమాలు నిర్వహిస్తున్నవారు పాటించవలసిన అంశాలను తెలియజేశారు. ప్రభుత్వపరంగాఎన్జీవోలకు కలిగే సౌకర్యాలను వివరించారు. ఇష్టానుసారంగా స్వచ్ఛంద సంస్థలను నిర్వహించరాదన్నారు. అనంతరం వృద్ధుల ఆశ్రమానికి మంచాలు, పరుపులను అందజేశారు. ట్రస్టు నిర్వాహకులు స్వప్నా, సీఎస్సార్ డెప్యూటీ మేనేజర్ ఆకుల రాంకిషన్, ఎన్వైపీ రాష్ట్ర అధ్యక్షుడు యాదవరాజు, రహమత్‌పాషా, వెంకటేష్, లింగమూర్తి, సాయికృష్ణ, లింగమూర్తి, శ్యాం, ఓంకార్‌తో పాటు వివిధ సంఘాల నిర్వాహకులు పాల్గొన్నారు.