reshuffle
-
ఢిల్లీ ప్రభావం.. పంజాబ్ క్యాబినెట్లో మార్పులు
చండీగఢ్: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మార్పులు చోటుచేసుకున్న దరిమిలా ఆ ప్రభావం పంజాబ్‌పై పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా చేయడం, అనంతరం కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ముందడుగు వేసింది. పంజాబ్ నీటి సరఫరా, పారిశుధ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బ్రహ్మ్ శంకర్ జింపా, సమాచార, పౌరసంబంధాలు, మైనింగ్, భూమి ప్రకటనల శాఖ మంత్రి చేతన్ సింగ్ జోరామజ్రా, పర్యాటక మంత్రి అన్మోల్ గగన్ మాన్‌తో పాటు మరో మంత్రి బాల్కర్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను పంజాబ్ ప్రభుత్వం ఆమోదించి, వెంటనే గవర్నర్‌కు పంపింది. అనంతరం పంజాబ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను ప్రకటించింది. కొత్తగా బరీందర్ కుమార్ గోయల్, తరణ్‌ప్రీత్ సింగ్ సౌంద్, మహీందర్ భగత్, హర్దీప్ సింగ్ ముండియాలను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు ప్రకటించింది.ఈ నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే తొలిసారి. 30 నెలల భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఇది నాల్గవసారి మంత్రివర్గ విస్తరణ. 117 మంది ఎమ్మెల్యేలున్న పంజాబ్ అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ సహా 15 మంది మంత్రులు కేబినెట్లో ఉన్నారు. మంత్రి మండలిలో మొత్తం 18 మంది మంత్రులు ఉండేందుకు అవకాశముంది. ఇది కూడా చదవండి: Sign Languages Day: ఒకప్పుడు చులకనగా చూసినవాళ్లే నేడు.. -
త్వరలో స్టాలిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ! ఆ మంత్రి ఔట్
తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ త్వరలో కేబినేట్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారని అధికారికి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఈ నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నందున మరో రెండు వారాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదీగాక రాష్ట్ర మంత్రివర్గంలో 53 మంది మంత్రులు ఉన్నారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% గరిష్టానికి చేరుకుంది. ఐతే దీనిలో ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వోచ్చని, కొందర్ని నిష్క్రమించమని కోరే అవకాశం ఉందని సమాచారం. పనితీరు సరిగా లేని కనీసం ఇద్దరు మంత్రులను రాజీనామా చేయమని చెప్పే అవకాశం ఉందంటూ జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందులో రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి స్టాలిన్, అతని కుటంబంపై ఆర్థిక మంత్రి చేసిన ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి త్యాగరాజన్‌పై వేటుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు నేతలు. కాగా, గతవారమే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ ఆడియో ఫైళ్లను చౌక రాజకీయాలుగా కొట్టిపారేశారు. ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించారు. అయితే మంత్రివర్గ వ్యవస్థీకరణలో ఈసారి డీఎంకే ఎమ్మెల్యే టీరా్బీ రాజా, శంకరన్ కోవిల్ వంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని పలువురు నాయకులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..) -
కేబినెట్ ప్రక్షాళనే
సాక్షి, బెంగళూరు: ఉప ఎన్నికలు, విధాన పరిషత్తు పోరు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంతో నాయకత్వం పునరాలోచనలో పడింది. వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ముఖ్య మార్పులు చేయాలని చూస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత బొమ్మై సర్కారుకు భారీ సర్జరీ చేస్తారని అంచనా. బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతి సారీ పదవులు అనుభవిస్తున్న సుమారు పది మంది సీనియర్ నేతలను మంత్రివర్గం నుంచి తప్పించాలని హైకమాండ్ యోచిస్తోంది. వారిని పార్టీ బలోపేతానికి వాడుకుంటూ, జనాదరణ ఉన్న కొత్త నేతలకు మంత్రి పదవుల్ని కట్టబెడితే వచ్చే ఎన్నికల్లో పుంజుకోవచ్చని ఆశిస్తోంది. గ్రూపులతోనే చిక్కు.. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత గ్రూపులు ఏర్పడ్డాయి. సీఎం వర్గం.. మాజీ సీఎం వర్గం.. సీఎం వ్యతిరేక వర్గం.. వలస వచ్చిన వారు.. ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు, పార్టీ పెద్దల ఆశీస్సులున్న వారు తదితర గ్రూపులతో చిక్కు ఏర్పడుతోంది. ఒకే పార్టీలో మూడు నాలుగు తలుపులు ఉండటంతో ఏ కార్యక్రమం సవ్యంగా సాగడం లేదనే విమర్శలున్నాయి. ఓ వర్గానికి న్యాయం చేస్తే.. మరో వర్గం నుంచి వ్యతిరేకత వస్తోంది. ఫలితంగా ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడుతోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు సమర్థులకు బాధ్యతలు అప్పజెప్పేందుకు అధిష్టానం సిద్ధమైంది. 8, 9న నంది బెట్టలో సభ.. ఈ నెల 8, 9వ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇన్చార్జ్ అరుణ్‌సింగ్, సీనియర్ నేత బీఎల్ సంతోష్, సీఎం బొమ్మై తదితరులతో కలిసి నంది హిల్స్‌లో మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాల గురించి వివరిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా విశ్లేషణ ఉంటుందని సమాచారం. -
కేంద్ర కేబినెట్లోకి కొత్త ముఖాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం ముహూర్తం ఖరారవడంతో పదవుల కోసం నిరీక్షిస్తున్న ఆశావహుల్లో క్షణక్షనానికి ఉత్కంఠ పెరుగుతోంది. 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు, రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకున్న జరుగనున్న అతిపెద్ద మంత్రివర్గ విస్తరణ ఇదే అవడం వల్ల ఇప్పుడు పదవి దక్కకపోతే మరో టర్మ్ వరకు పదవి దక్కదని ఆశావహులు భావిస్తున్నారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణనకు పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే దాదాపు పది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషికి కొత్త కేబినెట్లో చోటు దొరికే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ ఠాకూర్ లేదా మాజీ ముఖ్యమంత్రి పీకే ధుమాల్లో ఒకరిని పదవి వరించనుంది. ఉమాభారతి స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన బీసీ నాయకుడు ప్రహ్లాద్ పటేల్‌కు కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ నుంచి ఓపీ మాథూర్ కేబినెట్‌కు రంగంలో ఉన్నారు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఆయన్ని కేబినెట్లోకి తీసుకోకూడదంటూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేబినెట్ విస్తరణలో వ్యక్తుల ప్రతిభా పాటవాలను పరిగణలోకి తీసుకోవడంతోపాటు ప్రాంతీయ సమతౌల్యతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలను దష్టిలో పెట్టుకోవడంతోపాటు ఇటీవల ఎన్డీయే కూటమిలో చేరిన కొత్త మిత్ర పక్షాలకు కూడా చోటు కల్పించాల్సి ఉంటుంది. నితీష్ కుమార్ పార్టీ అయిన జనతాదళ్–యూ కూటమిలో చేరినందున ఆ పార్టీ నుంచి ఆరీసీపీ సింగ్, అఖిల భారత అన్నా డిఎంకె నుంచి వి. మైత్రేయన్, ఎం. తంబిదురైలకు కేబినెట్లోకి అవకాశం లభించవచ్చు. ఇక మనోహర్ పర్రీకర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడం, వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే శాఖకు రాజీనామా చేస్తానని సురేశ్ ప్రభు ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరి స్థానాలను కూడా మోదీ ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. పర్రీకర్ నిర్వహించిన కీలకమైన రక్షణ శాఖను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదనపు బాధ్యతగా ప్రస్తుతం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇంతటి కీలకమైన రక్షణ శాఖను ఎవరికి అప్పగిస్తారా? అన్న అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ నెలకొనే ఉంది. ఇక సురేశ్ ప్రభు స్థానంలో కేంద్ర రైల్వే శాఖను ఇప్పటికే కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్న గడ్కారీకి ఇవ్వొచ్చని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. -
‘అలక నేతలకు చంద్రబాబు చెబుతున్నదదే’
-
మంత్రుల శాఖల్లో త్వరలో కీలక మార్పులు..
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ కేబినెట్ లో త్వరలోనే మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని, అయితే పలానా తేదీ రోజు ఈ మార్పులుంటాయని చెప్పలేమని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా మంత్రి వర్గంలో కొత్త వారికి చోటు దక్కుతుందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర మంత్రిగా సేవలందించిన సర్భానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ మంత్రి పదవి ఖాళీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలుకుతారని, మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
మ్యాక్స్ ఇండియా పునర్వ్యస్థీకరణకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: మ్యాక్స్ ఇండియా కంపెనీ పునర్వ్యవస్థీకరణకు పంజాబ్, హర్యానా హైకోర్ట్ ఆమోదం లభించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మ్యాక్స్ ఇండియా మూడు కంపెనీలుగా విడిపోతోంది. మ్యాక్స్ ఇండియా కంపెనీ మ్యాక్స్ పైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడవుతుందని కంపెనీ తెలిపింది. మిగిలిన రెండు కంపెనీలు (మ్యాక్స్ ఇండియా, మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్) వచ్చే ఫిబ్రవరి నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడవుతాయని తెలియజేసింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జీవిత బీమా వ్యాపారాన్ని, మ్యాక్స్ ఇండియా ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య బీమా, ఇతర వ్యాపారాలను, మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ తయారీ రంగ కార్యకలాపాలను చూస్తాయని తెలిపింది. కాగా మ్యాక్స్ ఇండియా పునర్వ్యస్థీకరణకు ఇప్పటికే సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, కాంపిటీ షన్ కమీషన్ ఆఫ్ ఇండియాలు(సీసీఐ) ఆమోదం తెలిపాయి. -
ఐపీఎస్ లకు స్థాన చలనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) అధికారులకు అదనపు డెరైక్టర్ జనరల్‌గా పదోన్నతి కల్పించింది. మరో నలుగురు డీఐజీ స్థాయి అధికారులకు ఐజీలుగా పదోన్నతులు లభించాయి. నలుగురు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో, వివిధ హోదాల్లో పని చేస్తున్న 16 మంది బదిలీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.