తెలంగాణలోని పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) అధికారులకు అదనపు డెరైక్టర్ జనరల్‌గా పదోన్నతి కల్పించింది. మరో నలుగురు డీఐజీ స్థాయి అధికారులకు ఐజీలుగా పదోన్నతులు లభించాయి. నలుగురు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో, వివిధ హోదాల్లో పని చేస్తున్న 16 మంది బదిలీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.