
మంత్రుల శాఖల్లో త్వరలో కీలక మార్పులు..
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ కేబినెట్ లో త్వరలోనే మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని, అయితే పలానా తేదీ రోజు ఈ మార్పులుంటాయని చెప్పలేమని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా మంత్రి వర్గంలో కొత్త వారికి చోటు దక్కుతుందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
కేంద్ర మంత్రిగా సేవలందించిన సర్భానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ మంత్రి పదవి ఖాళీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలుకుతారని, మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.