తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ త్వరలో కేబినేట్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారని అధికారికి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఈ నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నందున మరో రెండు వారాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదీగాక రాష్ట్ర మంత్రివర్గంలో 53 మంది మంత్రులు ఉన్నారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% గరిష్టానికి చేరుకుంది. ఐతే దీనిలో ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వోచ్చని, కొందర్ని నిష్క్రమించమని కోరే అవకాశం ఉందని సమాచారం.
పనితీరు సరిగా లేని కనీసం ఇద్దరు మంత్రులను రాజీనామా చేయమని చెప్పే అవకాశం ఉందంటూ జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందులో రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి స్టాలిన్, అతని కుటంబంపై ఆర్థిక మంత్రి చేసిన ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి త్యాగరాజన్‌పై వేటుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు నేతలు.
కాగా, గతవారమే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ ఆడియో ఫైళ్లను చౌక రాజకీయాలుగా కొట్టిపారేశారు. ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించారు. అయితే మంత్రివర్గ వ్యవస్థీకరణలో ఈసారి డీఎంకే ఎమ్మెల్యే టీరా్‌బీ రాజా, శంకరన్ కోవిల్ వంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని పలువురు నాయకులు చెబుతుండటం గమనార్హం.
(చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..)
Comments
Please login to add a commentAdd a comment