సాక్షి, నందిగామ: తనకు న్యాయం చేయాలంటూ కృష్ణాజిల్లా ఎస్పీ త్రిపాఠిని ఆశ్రయించాడో ప్రేమికుడు. వివరాలు ఇలా ఉన్నాయి. సురేష్ అనే యువకుడు శ్రీజ అనే యువతిని ప్రేమించి గత నెల 21న వివాహం చేసుకున్నాడు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు ఒప్పుకోకపోగా సురేష్‌ను బెదిరించారు. దీంతో ఇద్దరూ ఈ నెల 4న చెన్నై పారిపోయారు. చెన్నైలో ఉన్న శ్రీజను ఆమె కుటుంబీకులు బలవంతంగా తీసుకొచ్చి సురేష్‌పై నందిగామ పోలీసు స్టేషన్‌లో కిడ్నాప్ కేసు పెట్టారు. నందిగామ డీఎస్పీ రాధేష్ మురళి కూడా అమ్మాయి కులానికే చెందినవాడు కావడంతో తనను బెదిరిస్తున్నాడని బాధితుడు సురేష్ త్రిపాఠికి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి వారం రోజులైనా నందిగామ ఎస్సై సురేష్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని తెలిపాడు. సురేష్ ఫిర్యాదుతో సీఐ వెంకటరమణ, ఎస్సై సురేష్‌లపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. అమ్మాయిని మర్చిపోవాలంటూ డీఎస్పీ, సీఐ, ఎస్సైలు బెదిరించారని బాధితుడు ఆరోపించాడు.
Comments
Please login to add a commentAdd a comment