lover family
-
ప్రియురాలి కుటుంబంపై కత్తితో దాడి
-
న్యాయం చేయండి: ఎస్పీని ఆశ్రయించిన ప్రేమికుడు
సాక్షి, నందిగామ: తనకు న్యాయం చేయాలంటూ కృష్ణాజిల్లా ఎస్పీ త్రిపాఠిని ఆశ్రయించాడో ప్రేమికుడు. వివరాలు ఇలా ఉన్నాయి. సురేష్ అనే యువకుడు శ్రీజ అనే యువతిని ప్రేమించి గత నెల 21న వివాహం చేసుకున్నాడు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు ఒప్పుకోకపోగా సురేష్‌ను బెదిరించారు. దీంతో ఇద్దరూ ఈ నెల 4న చెన్నై పారిపోయారు. చెన్నైలో ఉన్న శ్రీజను ఆమె కుటుంబీకులు బలవంతంగా తీసుకొచ్చి సురేష్‌పై నందిగామ పోలీసు స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. నందిగామ డీఎస్పీ రాధేష్ మురళి కూడా అమ్మాయి కులానికే చెందినవాడు కావడంతో తనను బెదిరిస్తున్నాడని బాధితుడు సురేష్ త్రిపాఠికి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి వారం రోజులైనా నందిగామ ఎస్సై సురేష్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని తెలిపాడు. సురేష్ ఫిర్యాదుతో సీఐ వెంకటరమణ, ఎస్సై సురేష్‌లపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. అమ్మాయిని మర్చిపోవాలంటూ డీఎస్పీ, సీఐ, ఎస్సైలు బెదిరించారని బాధితుడు ఆరోపించాడు. -
పెళ్లికి నిరాకరించారని.. కొడవలితో దాడి!
హైదరాబాద్ (చాంద్రాయణగుట్ట): పెళ్లికి నిరాకరిస్తున్నారన్న అక్కసుతో ప్రియురాలితో పాటు ఆమె తండ్రిపై దాడి చేసిన యువకుడిని శాలిబండ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. శాలిబండ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇన్స్పెక్టర్ నల్లపు లింగయ్యతో కలిసి ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్ కేసు వివరాలు వెల్లడించారు. మిశ్రీగంజ్ యాహ్యా పాషా మసీదు ప్రాంతానికి చెందిన మజ్దూద్ అబ్దుల్లా కుమార్తె అర్షియా(26), ఆసిఫ్‌నగర్‌కు చెందిన అంజద్(26)లు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయమై కొన్నాళ్ల క్రితం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇటీవల అంజద్ పెళ్లి విషయమై అర్షియా ఇంట్లో అడిగాడు. ఎలాంటి పని చేయకుండా తిరుగుతున్న నీతో అర్షియా వివాహం జరిపించలేమని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మరోసారి బుధవారం రాత్రి అడిగేందుకు వచ్చాడు. యువతి కుటుంబ సభ్యుల నుంచి మళ్లీ అదే సమాధానం రావడంతో ఆగ్రహానికి గురైన అతడు అర్షియా చేతులు, వీపు భాగంతో పాటు ఆమె తండ్రి అబ్దుల్లాపై కూడా కొడవలితో దాడికి పాల్పడ్డాడు. అతడు ఒక్కసారిగా మృగాడిగా మారడంతో గాయాలతోనే ఉన్న అర్షియా అతని కళ్లల్లో కారం చల్లి తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చసి గురువారం రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి దాడికి పాల్పడిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్సై ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.