మోడీ వర్సెస్ నితీష్.. రేపు బీహార్ లో సవాల్ | Nitish Kumar, Narendra Modi face-off at Nawada tomorrow | Sakshi
Sakshi News home page

మోడీ వర్సెస్ నితీష్.. రేపు బీహార్ లో సవాల్

Published Tue, Apr 1 2014 5:54 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీ వర్సెస్ నితీష్.. రేపు బీహార్ లో సవాల్ - Sakshi

మోడీ వర్సెస్ నితీష్.. రేపు బీహార్ లో సవాల్

నవాడ: ఇన్నాళ్లూ ఘాటు విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కించిన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లు ఇప్పుడు ఒకే రోజు, ఒకే జిల్లాలో తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. బీహార్లోని నవాడ జిల్లా ఇందుకు వేదిక కాబోతోంది. బుధవారం మోడీ, నితీష్ తమ పార్టీల అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన బోతున్నారు.

నవాడకు 25 కిలో మీటర్ల దూరంలో గల నడ్రీగంజ్లో జరిగే ర్యాలీలో నితీష్ పాల్గొంటుండగా, నవాడలో జరిగే బహిరంగ సభకు మోడీ హాజరవుతారు. కాగా వీరిద్దరి సభలు ఒకే సమయంలో గాక మూడు గంటల తేడాతో జరుగుతాయి. ఇరు పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభలను విజయవంతం చేసుందుకు కృషిచేస్తున్నారు. మోడీని వ్యతిరేకించి జేడీయూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మోడీ, నితీష్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం నవాడ జిల్లాలో జరిగే సభలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వీరిద్దరూ మరోసారి మాటలకు పదును పెట్టడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement