సమావేశంలో మాట్లాడుతున్న కందుల దుర్గేష్, చిత్రంలో రౌతు సూర్యప్రకాశరావు, మేడపాటి షర్మిలారెడ్డి, తదితర నాయకులు
సాక్షి, రాజమహేంద్రవరం: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో బ్లాక్‌డేలా నిలిచిపోతుందని వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ అభివర్ణించారు. పోలవరం, రాజధాని, విశాఖ రైల్వే జోన్ అంశాలకు కనీసం ప్రస్తావన కూడా లేదని మండిపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో గడిచిన నాలుగేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉన్న టీడీపీ సర్కారు ఏం సాధిం చిందో చెప్పాలన్నారు. శుక్రవారం ఆయన పార్టీ నేతలతో కలసి స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టం అంశాల అమలుకు ఒత్తిడి తెస్తేనే ఫలితం ఉం టుందని తమ పార్టీ చెబుతున్నా రాష్ట్ర సర్కారు పెడచెవిన పెట్టిందని దుయ్యబటారు. ప్రస్తుత బడ్జెట్ చూశాక ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే రాష్ట్రం తరఫున అడిగేందుకు ఎవరూ ఉండేవారు కాదన్న విషయం అర్థమవుతోందన్నారు. రాష్ట్రానికి అన్యా యం చేస్తే తమ ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటామని చంద్రబాబు ఒత్తిడి తెచ్చి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేదికాదన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు ఏడా ది ప్రాజెక్టుకు అవసరమైన రూ. 44 వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. కేంద్రం నిర్మించి ఇవ్వాల్సిన జాతీయ ప్రాజెక్టును తా ము నిర్మిస్తామని ముడుపుల కోసం చంద్రబాబు తీసుకున్నారని ఆరోపించారు. 11 విద్యాసంస్థలుకు ఎంగిలి మెతుకులు విదిల్చినట్టు నిధులు ఇ చ్చి వాటిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం నగర కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి ఢిల్లీపై పోరాడిన ఎన్టీరామారావును కూలదోసి ఆ పార్టీని ఇప్పుడు సీఎం చంద్రబాబు తాకట్టు పెడుతున్నారన్నారు. నాలు గేళ్లు మిన్నుకుండి ఇప్పుడు తన అనుకూల పత్రికల్లో ఇదేంటని రాయించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు గిరిజాల బాబు, మేడపాటి షర్మిలారెడ్డి, బొం తా శ్రీహరి, బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, మాజా రామజోగి, పెంకె సురేష్, యడ్లమహేష్, చిక్కాల బాబులు, పేట రామకృష్ణ, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment