ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
Published Mon, Apr 3 2017 8:55 AM | Last Updated on Mon, Oct 29 2018 8:34 PM
► నడివీధిలో రాజ్యాంగం ఖూనీ
► టీడీపీలో సమర్థులు లేకే ఫిరాయింపుదారులకు అందలం
► నీచ రాజకీయాల చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగలడం ఖాయం
► ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజం
► అంబేడ్కర్ విగ్రహా కళ్లకు గంతలు కట్టి నిరసన
తిరుపతి రూరల్: చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని నడివీధిలో ఖూనీ చేసిందని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మె ల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీ యూనివర్సిటీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. అంబేడ్కర్ కళ్లకు నల్లగుడ్డలతో గంతలు కట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. చెవిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి అవకాశవాది అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని, టీడీపీలో సమర్థులు లేకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అందలం ఎక్కిం చారని మండిపడ్డారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో చీకటిరోజు అన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోవటం ఖాయమని పేర్కొన్నారు.
రాస్తారోకో..అరెస్ట్..
చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తిరుపతి–చిత్తూరు రహదారిపై రాస్తారోకో చేపట్టాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎస్వీయూ సీఐ శ్రీని వాసులు సిబ్బందితో వచ్చి ఎమ్మెల్యే చెవిరెడ్డిని, నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎస్వీయూ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అ«ధ్యక్షుడు దామినేటి కేశవులు, పార్టీ మండలాధ్యక్షుడు మూలం బాబు, మాధవరెడ్డి, మస్తాన్, మల్లారపు వెంకటరమణ, హరినా«థ్, చిన్నియాదవ్, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, జోగి మోహన్, గోపి, యుగంధర్‌రెడ్డి, అజయ్‌కుమార్‌రెడ్డి, వీరనారాయణరెడ్డి, మునస్వామియాదవ్, భాస్కర్‌రెడ్డి, ఒంటేల శివ, భానుకుమార్‌రెడ్డి, పాల్గొన్నారు.
గవర్నర్ తీరు సిగ్గుచేటు
స్వార్థరాజకీయాల కోసం పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్ తీరు దారుణమని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ తీరు సిగ్గుచేటన్నారు. గవర్నర్ పదవికే మచ్చ తెచ్చిన నరసింహన్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement