సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనేది ఒక మతిలేని చర్య అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఏడాది కిందట ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ చర్య దేశంలో మహా విషాదాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. దేశంలోని లక్షలాది నిజాయితీపరుల జీవితాలను నోట్లరద్దు విషాదంలో ముంచిందని ఆయన అన్నారు. కోట్లాది భారతీయులను డిమానిటైజేషన్ నిర్ణయం ఇబ్బందుల్లోకి, బాధల్లోకి నెట్టిందని ఆయన అన్నారు.
అత్యంత వేగంగా దూసుకు పోతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఈ నిర్ణయం ఆగాథంలోకి నెట్టిందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నోట్ల మార్పిడి కోసం నిలుచున్నవారు.. క్యూ లైన్లోనే మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన గుర్తు చేశారు. డిమానిటైజేషన్ అనేది భారతీయుల నిజాయితీని పరీక్షించడమేనని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు చర్యను కాంగ్రెస్ పార్టీ బ్లాక్ డేగా పాటిస్తుందని ఆయన చెప్పారు.
Demonetisation is a tragedy. We stand with millions of honest Indians, whose lives & livelihoods were destroyed by PM’s thoughtless act.
— Office of RG (@OfficeOfRG) 8 November 2017
"एक आँसू भी हुकूमत के लिए ख़तरा है
— Office of RG (@OfficeOfRG) 8 November 2017
तुमने देखा नहीं आँखों का समुंदर होना" pic.twitter.com/r9NuCkmO6t
Comments
Please login to add a commentAdd a comment