అనంతపురంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మకు అంతిమయాత్ర
అనంతపురం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సమైక్యవాదులు ఈ రోజును బ్లాక్ డేగా పాటించారు. జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్ నుంచి సోనియా గాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్గం చేశారు.క్లాక్ టవర్ వద్ద టీచర్లు మానవహారం ఏర్పాటు చేశారు. పెనుకొండ ఉపాధ్యాయ జేఏసీ సోనియా జన్మదినాన్ని విద్రోహదినంగా ప్రకటించింది.
హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ముస్లీం నగర సమితి ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్మించారు. తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ ఉరవకొండలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో సోనియాకు పిండ ప్రధానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఇదిలా ఉండగా, అనంతపురంలో జరిగిన సోనియాగాంధీ జన్మదిన వేడుకలు కూడా దాడికి దారి తీశాయి. కాంగ్రెస్ నేత గోపాల్ రాష్ట్రాన్ని విభజించిన సోనియాకు సంతాపం తెలిపారు. మంత్రి శైలజానాథ్ అనుచరుడు దాదా గాంధీ గోపాల్‌పై దాడి చేశాడు.
ఫొటోలు : జి.వీరేష్, అనంతపురం