సోనియా, మన్మోహన్లకు అనంత కోర్టు నోటీసులు | Sonia Gandhi, Manmohan singh notice issued by anathapuram court | Sakshi
Sakshi News home page

సోనియా, మన్మోహన్లకు అనంత కోర్టు నోటీసులు

Published Tue, Feb 4 2014 11:31 AM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM

సోనియా, మన్మోహన్లకు అనంత కోర్టు నోటీసులు - Sakshi

సోనియా, మన్మోహన్లకు అనంత కోర్టు నోటీసులు

భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఆరుగురు కేంద్రమంత్రులు ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన చేపట్టారని స్థానిక న్యాయవాదులు మల్లిఖార్జున, నాగన్నలు మంగళవారం అనంతపురం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ స్వీకరించిన అనంతపురం కోర్టు ప్రతివాదులైన సోనియా, ప్రధాని, ఆరుగురు కేంద్రమంత్రులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిరసిస్తూ సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతుంది. అయిన కేంద్రం తనదైన శైలిలో దూసుకువెళ్తుంది. విభజన బిల్లు ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ నుంచి రాష్ట్రపతికి వెళ్లింది. అయితే అసెంబ్లీ తీర్మానంతో తమకు పనిలేదని రాష్ట్ర విభజన తథ్యమని కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తుంది. ఆ నేపథ్యంలో అనంతపురానికి చెందిన న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement