న్యూఢిల్లీ: లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఈ రోజు బ్లాక్ డే అని సోనియా వ్యాఖ్యానించారు.
సోమవారం లోక్సభ కార్యకలాపాలకు అడ్డుతగిలిన 25 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. ఈ రోజు ఉదయం సోనియా గాంధీ మాట్లాడుతూ.. 'మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేసేదాకా మా నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం. సభ కొనసాగనివ్వబోము. మమ్మల్ని విమర్శించేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. సభలో మెజారిటీ ఉన్నంత మాత్రాన తప్పులు ఒప్పులైపోవు' అని విమర్శించారు.
'ప్రజాస్వామ్యానికి ఈ రోజు బ్లాక్ డే'
Published Mon, Aug 3 2015 4:56 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement