లవ్‌ ఇండియా: ట్రంప్‌ ట్వీట్ ‌వైరల్ | America Loves India Donald Trump Thanks PM Modi | Sakshi
Sakshi News home page

లవ్‌ ఇండియా : ట్రంప్‌ ట్వీట్ ‌వైరల్

Published Sun, Jul 5 2020 10:43 AM | Last Updated on Sun, Jul 5 2020 8:14 PM

America Loves India Donald Trump Thanks PM Modi - Sakshi

వాషింగ్టన్‌ :  భారత్‌పై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ‘అమెరికా లవ్స్‌ ఇండియా’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. అగ్రరాజ్యం 244వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడికి, ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్ర ఓ సందేశాన్ని పంపారు. దీనికి బదులుగా స్పందించిన అధ్యక్షుడు ట్రంప్‌.. థ్యాంక్యూ మై డియర్‌ ఫ్రెండ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. అమెరికా లవ్స్‌ భారత్‌ అంటూ మరోసారి తన అభిమానాన్ని ట్విటర్‌ ద్వారా చాటుకున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడిన విషయం తెలిసిందే. ఇరు దేశాల అధినేతలు సైతం ప్రపంచ వేదికలపై పలుమార్లు ప్రశంసలు కురిపించుకున్నారు. మరోవైపు భారత్‌-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో సైనికపరంగా భారత్‌కు అండగా ఉంటామంటూ అమెరికా ప్రకటించింది. (అగ్రరాజ్యం ఒకప్పుడు బానిసగానే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement