హైదరాబాద్: దేశవ్యాప్తంగా 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో.. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా తెలంగాణలో గోల్కొండ కోట మరోసారి పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ తీరంలో పంద్రాగస్టు వేడుకలను జరపడానికి సిద్ధమైంది.
ఖాకీ నీడలో హస్తిన నగరం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. ఐబీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీకి ఏడంచెల భద్రత కల్పించారు. ఢిల్లీలో 40వేల మంది పోలీసులు పహారా వేశారు. దాంతో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.