
లక్నో : విద్యార్ధులకు జాతీయ గీతంపై గౌరవాన్ని పెంపొందించాల్సిన ఉపాధ్యాయుడే దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ గీతంపై అవమానకరంగా ప్రవర్తించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాలేజీలో జెండా ఆవిష్కరించిన అనంతరం విద్యార్థినిలు జాతీయ గీతం పాడుతుండగా కళాశాల ప్రిన్సిపాల్ దానికి నిరాకరించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌ఘనీలో మదర్సా బాలికల కళాశాలలో బుధవారం చోటుచేసుకుంది. సహా ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు మదర్సా ప్రిన్సిపాల్ ఫజ్ల్‌ర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు జూనైద్ అన్సారీ, నిజాంలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
అరేబియా అలే సునాత్ బాలికల కళాశాల యూపీ మదర్సా బోర్డుపై 2007లో నమోదు చేయబడి ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న కాలేజేలో ప్రిన్సిపాల్ జెండా ఆవిష్కరించగానే విద్యార్థినిలు జాతీయ గీతం పాడుతుండగా వారికి ప్రిన్సిపాల్ వారించినట్లు త్రిపాఠి అనే ఉపాధ్యాయుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. త్రిపాఠి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా జాతీయ గీతాన్ని అవమానించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుని, కళాశాల గుర్తింపుని రద్దు చేయవల్సిందిగా జిల్లా మెజిస్టేట్ అమర్‌నాథ్ ఉపాధ్యాయ అధికారులను ఆదేశించారు. కాగా దేశంలోని అన్ని మదర్సాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తప్పనిసరిగా నిర్వహించాలని కే్ంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాల జారీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment