సాక్షి, అమరావతి: ఆగస్టు నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకులకు ఆ రోజున కూడా సెలవు. ఈ సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఆన్‌లైన్ చెల్లింపులు కూడా పనిచేయవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment