bakreed
-
Eid Al-Adha 2024: మౌలిక విధులు..
ఇస్లామ్ ధర్మంలోని ఐదు మౌలిక సూత్రాల్లో ‘హజ్’ కూడా ఒకటి. కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనే మౌలిక సూత్రాల్లో ఏ ఒక్కదాన్ని నమ్మక పోయినా విశ్వాసం పరిపూర్ణం కాదు. అందుకని ఈ ఐదు అంశాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఇందులోని చివరి అంశం హజ్. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం మక్కాలో నిర్మించిన దైవ గృహ సందర్శనా ప్రక్రియను ‘హజ్’ అంటారు.హజ్ అనేది ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్ హజ్జ్ నెల పదవ తేదీన మక్కాలో నిర్వహించబడుతుంది. అదేరోజు యావత్ ప్రపంచ ముస్లింలు ఈద్ జరుపుకొని ఖుర్బానీలు సమర్పిస్తారు. ఇస్లామీయ క్యాలండరులో ఇది చివరి నెల. దీని తరువాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.అందుకే ఈ నెలకు ఎనలేని ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ నెలలోని మొదటి పదిరోజులూ చాలా ప్రాముఖ్యం కలిగినవి. ఈ దశకంలో దైవ కారుణ్యం కుండపోతగా వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ గొప్ప ప్రాముఖ్యాన్ని కలిగి దేవుని కృపకు పాత్రమవుతుంది. ఈ దినాల్లో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరం కావు. ఈరోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా (ఉపవాసం)... ఏడాది మొత్తం పాటించే రోజాలకు సమానం. ‘అరఫా’ (జిల్ హజ్ నెల 9వ తేదీ) నాటి ఒక్క రోజా రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అరఫా రోజు సైతాన్ ఘోర పరాజయాన్ని చవిచూస్తాడు. అవమాన భారంతో చితికి పోతాడు.‘అరఫా’ రోజు ‘లాయిలాహ ఇల్లల్లాహు వహదహూ లాషరీ కలహు, లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలాకుల్లి షయ్ ఇన్ ఖదీర్’ అనే దుఆ ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. దీనితో పాటు ‘తహ్ లీల్’ అంటే, ‘లాయిలాహ ఇల్లల్లాహ్’; ‘తక్బీర్’ అంటే, ‘అల్లాహుఅక్బర్’; ‘తహ్ మీద్’ అంటే, ‘అల్ హందులిల్లాహ్’; ‘తస్ బీహ్’ అంటే, ‘సుబ్ హానల్లాహ్’ అని తరచుగా ధ్యానిస్తూ ఉండాలి. అరఫా రోజే కాకుండా ‘అయ్యామె తష్రీఖ్’లో కూడా అంటే, పండుగ తరువాతి మూడు రోజులూ (జిల్ హజ్ నెలలోని 11, 12, 13 తేదీలు) వీలైనంత అధికంగా ఈ వచనాలు పఠించాలి. కనుక ఈ సుదినాలను సద్వినియోగం చేసుకుంటూ పండుగ ముందు రోజు పాటించే ‘అరఫా’ ఉపవాసం పాటించి, సత్కార్యాలు ఆచరిస్తూ దైవక్రృపకు పాత్రులు కావడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ సన్మార్గ పథం అనుగ్రహించుగాక! – మదీహా అర్జుమంద్ (నేడు బక్రీద్) -
ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి
కాబూల్: బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని దేశ అధ్యక్షుడు ప్రసంగం చేసే సమయానికి ముందే అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ ఘటన పండుగ వేళ కలకలం రేపింది. ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనం లక్ష్యంగా మంగళవారం రాకెట్ల దాడి జరిగింది. దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న అధ్యక్ష భవనం సమీపంలోకి మూడు రాకెట్లు వచ్చిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ చర్యను ఆఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బక్రీద్ సందర్భంగా అధ్యక్ష భవనంలో ఉదయం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు అశ్రఫ్ గని ప్రసంగం మొదలుపెట్టాలి. ప్రార్థనలు కొనసాగుతున్న సమయంలో అధ్యక్ష భవనానికి సమీపంలో రాకెట్ల దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. అయితే రాకెట్లు భవనం సమీపంలో పడినా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆఫ్ఘాన్ మంత్రి మిర్వాస్ స్టాన్క్జాయ్ ప్రకటించారు. ఈ దాడి ఎవరు జరిపారో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆ దేశంలో తాలిబన్ల దాడులు తీవ్రంగా ఉన్నాయి. పండుగ వేళ కలకలం రేపేలా వారి చర్యలు ఉన్నాయని భావిస్తున్నారు. అమెరికా, నాటో దళాలు పూర్తిగా విరమించుకున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఏకంగా అధ్యక్ష భవనం లక్ష్యంగా దాడి చేయడం ఆందోళన కలిగించే విషయమే. అయితే ఈ దాడిని అధ్యక్షుడు అశ్రఫ్ గని తీవ్రంగా ఖండించారు. తాలిబన్ల తీరుపై అశ్రఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ముస్లిం సోదరులకు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని’’ సీఎం జగన్ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అభిలషించారు. విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ చేసుకునే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. అల్లాహ్ ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.#EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) July 21, 2021 -
‘బక్రీద్’ మినహాయింపులపై కేరళకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా కోవిడ్ నిబంధనలకు కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు మినహాయింపు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మినహాయింపులపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు స్పందించింది. పాజిటివిటీ రేటు కేరళలో 10% పైగానే ఉన్నా బక్రీద్ కోసం కోవిడ్ నిబంధనలకు మినహాయింపు ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. ఈ పిటిషన్‌పై వెంటనే స్పందించాలని కేరళ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తాజాగా మంగళవారం కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వ్యాపారుల ఒత్తిడితో సడలింపులు ఇవ్వడమేమిటని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. పౌరులు జీవించే హక్కుకు భగం కలిగించినట్టేనని న్యాయస్థానం పేర్కొంది. పౌరులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జూలై 21వ తేదీన బక్రీద్ పర్వదినం ఉండడంతో కేరళ ప్రభుత్వం మూడు రోజులు సడలింపులు ఇచ్చింది. 18 నుంచి 20వ తేదీ వరకు టెక్స్టైల్స్, ఫుట్‌వేర్, జ్యువెల్లరీ, ఫ్యాన్సీ స్టోర్ తదితర అన్ని దుకాణాలు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని కేరళ సీఎం విజయన్ ప్రకటించారు. కోవిడ్ కేసుల ఆధారంగా నిర్ధారించిన ఏ, బీ, సీ కేటగిరీ ప్రాంతాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని, పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న డీ కేటగిరీ ప్రాంతంలో 19న మాత్రమే ఈ మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ముందుకు వచ్చింది. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
-
బ్యాంకులకు వరుస సెలవులు
సాక్షి, అమరావతి: ఆగస్టు నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకులకు ఆ రోజున కూడా సెలవు. ఈ సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ చెల్లింపులు కూడా పనిచేయవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు. -
ఈ జత ధర రూ.32 వేలు
మోమిన్‌పేట : మోమిన్‌పేటలో శనివారం జరిగిన మేకల సంతలో అత్యధిక ధరకు రెండు గొర్రె పొట్టేళ్లు అమ్ముడుపోయాయి. జతగా ఉన్న ఈ రెండు పొట్టేళ్లు ఏకంగా రూ.32 వేలు ధర పలకడం హాట్ టాపికైంది. ఈ నెలలో బక్రీద్ పండుగ ఉండడంతో ఇంత ధర పలికిందని తెలుస్తోంది. మోమిన్‌పేటకు చెందిన షేక్ బాబ్జాని వాటిని కొనుగోలు చేశాడు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పొట్టేళ్లను కోసి పేదలకు దేవుడి పేరుతో ఖుర్బానీ ఇచ్చారు. ఈద్గాల వద్ద ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నమాజ్ ముగిసిన తర్వాత మేక, గొర్రెపోతుల మాంసాన్ని పేదలకు పంచిపెట్టారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
-
‘క్రిస్‌గేల్’ మేక.. 2 లక్షల పొట్టేలు!!
నల్లగా నిగనిగలాడిపోతున్న ఈ మేకను చూశారా? దీనిపేరు క్రిస్ గేల్!! బరువు సుమారు 100 కిలోలు. రాజస్థాన్ నుంచి దిగుమతి అయిన దీని ధర రూ.90 వేలు. ఇక తెల్లగా తళతళలాడిపోతున్న పొట్టేలు బరువు 160 కిలోలు. దాని ధర అక్షరాలా 2 లక్షల రూపాయలు. వయసు మూడేళ్ల్లు. బక్రీద్‌ను పురస్కరించుకొని ముషీరాబాద్ ఏక్‌మినార్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీమ్ పంజాబ్ నుంచి దీన్ని తీసుకొచ్చారు. కాగా, బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్‌ను ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు.