
త్యాగానికి ప్రతీక బక్రీద్
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పొట్టేళ్లను కోసి పేదలకు దేవుడి పేరుతో ఖుర్బానీ ఇచ్చారు. ఈద్గాల వద్ద ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నమాజ్ ముగిసిన తర్వాత మేక, గొర్రెపోతుల మాంసాన్ని పేదలకు పంచిపెట్టారు.