
త్యాగధనుల బాటలో నడవాలి
అనంతపురం అర్బన్: దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు పాటుపడిన త్యాగధనుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయపతాకాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, జిల్లా ఖజానా డీడీ శర్మ, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలాజయరామప్ప, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఏడీ జయమ్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజనల్ పీఆర్‌ఓలు వేణుగోపాల్‌రెడ్డి, రమేశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.