స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 15 (శనివారం) న ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏడంచెల భద్రత కల్పించారు. ఐబీ హెచ్చరికతో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు పటిష్ట నిఘా వ్యవస్థను సిద్ధం చేశారు.