ఎయిర్‌పోర్టులో భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ
విమానాశ్రయం(గన్నవరం) :
విమానాశ్రయంలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ భవన ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకాన్ని సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం ఆవిష్కరించారు. వంద అడుగుల ఎత్తు కలిగిన స్తంభంపై 30 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగిన డే అండ్ నైట్ పతాకాన్ని ఆయన రిమోట్ బటన్ ద్వారా ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. పతాకం ప్రజల్లో జాతీయభావం, దేశభక్తిని పెంపొందించే విధంగా ఉందన్నారు. ముఖ్యంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం అందరికి గర్హకారణమన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు, విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, కలెక్టర్ బాబు.ఎ, విజయవాడ సీపీ గౌతమ్‌సవాంగ్, ఏఏఐ జీఎం ప్రభహరణ్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు పాల్గొన్నారు.