రూ.22 కోట్ల ఆస్తులు పంపిణీ
Published Tue, Aug 16 2016 12:44 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
నెల్లూరు (వేదాయపాళెం) :స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాఖల ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల లబ్ధిదారులకు రూ.22,60,47,000లు విలువైన ఆస్తులను సోమవారం మంత్రి నారాయణ, కలెక్టర్ ముత్యాలరాజు పంపిణీ చేశారు. 738 డ్వాక్రా సంఘాలకు రూ.20కోట్ల 35లక్షల బ్యాంక్ రుణాల చెక్కులు, గిరిజన సంక్షేమశాఖలో 18 మందికి సైకిళ్లు, 191 మందికి 243 ఎకరాల్లో అటవీభూముల హక్కు పత్రాలు, గిరిపుత్రిక కల్యాణం పథకం ద్వారా 30 మంది మహిళలకు రూ.15లక్షలు పంపిణీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకంలోని 48 మందికి కుట్టు మిషన్లు, ఉద్యానవనశాఖలో 23 మందికి రోటవేటర్లు, ఏడుగురికి తైవాన్ స్ప్రేయర్స్, మైక్రో ఇరిగేషన్‌లో 23 మందికి డ్రిప్, స్పింకర్ యూనిట్లు, ఎస్‌ఈ కార్పొరేషన్‌లో ఐదుగురికి ఆటోలు, ముగ్గురికి జెరాక్స్ మిషన్లు, 12 మందికి సబ్‌మెర్సిబుల్ మోటార్లు, 15 మందికి ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకం కింద చెక్కులు, 50 మందికి బ్యాంక్ లింకేజ్ రుణాల చెక్కులు, బీసీ కార్పొరేషన్‌లో 30 మందికి రూ.50వేలు చొప్పున (బుట్టల అల్లకం, కర్టన్స్ తయారీ), 15 మందికి ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున, మత్స్యశాఖలో డాట్‌లో 110 యూనిట్లకు రూ.11.75లక్షలు, జీపీఎస్ 9 యూనిట్లకు రూ.85వేలు, ఎక్స్‌గ్రేషియా కింద ముగ్గురికి రూ.5లక్షలు, ఐస్ బాక్సులకు రూ.23వేలు, మత్స్యకారులకు 10 మందికి సైకిళ్లు, వలలు, వికలాంగులశాఖలో ఐదుగురికి ట్రై సైకిళ్లు, 10 మందికి వీల్‌చైర్స్, 10 మందికి టచ్‌ఫోన్‌లు పంపిణీ చేశారు.
Advertisement
Advertisement