ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్స్ ఎప్పడు ఆసక్తిగా ఉంటాయి. ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2001లో వచ్చిన కాజోల్ ‘కబీ ఖుసీ కబీ గమ్’ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఆమె తన ట్విటర్‌లో శనివారం షేర్ చేశారు. ఇందులో కాజోల్ తన కుమారుడుని ‘సారే జహా సే అచ్చా హిందుస్తాన్ హమారా’ ఎప్పటికి మర్చిపోవద్దు అంటూ వారించిన సన్నివేశాన్ని పంచుకున్నారు. అలాగే వీడియో చివరిలో కాజోల్ జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దీనిని ‘రిపీట్ ఆఫ్టర్ మీ’ అనే క్యాప్సన్‌తో షేర్ చేశారు.
(చదవండి: సల్మాన్ ‘సారే జహాసే అచ్చా’ వీడియో వైరల్)
అయితే ఈ సినిమాల్లో షారుక్ ఖాన్, కాజోల్ వివాహం అనంతరం విదేశాల్లో స్థిరపడిన విషయం తెలిసిందే. అక్కడ తన కొడుకుకు భారతదేశం గొప్పతనం గురించి తరచూ వివరిస్తూ ఉంటుంది. చివరిగా కాజోల్ దేవి అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. ఇందులోని తన నటనకతో కాజోల్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లక్స్‌లో రాబోయే చిత్రం త్రిభంగలో నటిస్తున్నారు. రేణుకా సహనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కాజోల్ భర్త, హరో అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు.
Repeat after me!#IndependenceDay pic.twitter.com/kV21ie2wOR
— Kajol (@itsKajolD) August 15, 2020
Comments
Please login to add a commentAdd a comment