కాకి దేశభక్తి.. అసలు సంగతి ఇది! | Bird Unfurl National Flag In Kerala On Independence Day, Netizens Reactions On Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Bird unfurling Flag: కాకి దేశభక్తి.. జెండా ఎగరేసిందా? అసలు సంగతి ఇది!

Published Sat, Aug 17 2024 9:21 AM | Last Updated on Sat, Aug 17 2024 9:07 PM

Bird Unfirl National Flag In Kerala On Independence Day

తిరువనంతపురం: కేరళలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు అద్భుతం జరిగిందట. ఓ స్కూల్‌లో పిల్లలు, టీచర్లు కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అయితే జెండా పైకి వెళ్లిన తర్వాత కూడా తెరచుకోకుండా ముడుచుకునే ఉంది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందోగాని  ఓ కాకి సూపర్‌ హీరోలా వచ్చి ముడుచుకున్న జెండాను ముక్కుతో పూర్తిగా విప్పి తుర్రుమని ఎగిరిపోయింది. 

దీంతో జెండా రెపరెపలాడి అక్కడున్నవారిపై పూల వర్షం కురిసింది. అచ్చం సినిమాల్లో గ్రాఫిక్స్‌ సీన్‌ను తలపించిన ఈ వీడియోను ఎక్స్‌(ట్విటర్‌)లో ఓ నెటిజన్‌ పోస్టు చేయగా వైరల్‌గా మారింది అంటూ ఓ వీడియో చక్కర్లు కొట్టింది. 

పక్షి జెండాను రెపరెపలాడించిన ఈ వీడియో చూసిన వారు ఆసక్తికర కామెంట్లు పెట్టారు. గాడ్స్‌ఓన్‌ కంట్రీ కదా అలాగే జరుగుతుందని  ఒకరు, గత జన్మలో ఆ పక్షి దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుడేమో అని మరొకరు ఇది నిజంగా అద్భుతమని ఇంకొకరు  కామెంట్‌ చేశారు.   

Fact Check: అయితే అసలు విషయం ఏంటంటే.. ఆ కాకి వెనకాల ఉన్న చెట్టు మీద వాలింది. జాతీయ జెండాను ఎగరేసిన వ్యక్తి ఎవరో.. దాన్ని బలంగా లాగడం వల్లే తెరుచుకుంది. ఈలోపు ఆ అలికిడికి చెట్టు మీద కాకి జడుసుకుని ఎగిరిపోయింది. జెండా కర్రను డిఫరెంట్‌యాంగిల్‌లో చూపించడంతోనే అలా పక్షి ఎగరేసిన జెండా కథనం వైరల్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement