కొచ్చీ: ఆకలితో ఉన్న గర్భిణీ ఏనుగుకు పైనాపిల్ బాంబు తినిపించి చంపిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మనుషుల క్రూరత్వం వల్ల తల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా ఈ లోకాన్ని చూడకముందే కన్నుమూసింది. ఈ క్రమంలో తల్లీబిడ్డలను పొట్టనపెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ పలువురు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా "ఆ గర్భిణీ ఏనుగును దారుణంగా చంపింది ఇతనే.." అంటూ నెట్టింట్లో ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. (ఇంత ఆటవికమా: రోహిత్ శర్మ)
"ఇతడిని వదిలిపెట్టకండి, ఏనుగును హత్య చేసిన పాపానికి ఘోరమైన శిక్ష విధించండి" అంటూ పలువురు ఫేస్‌బుక్ యూజర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది అసత్య ప్రచారమేనని తేలింది. అతడికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడైంది. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొన్న కథనం ప్రకారం.. ఫొటోలో కన్పిస్తున్న అతడి పేరు తడి పేరు మధు. గిరిజన తెగకు చెందిన అతడు కేరళలోని పాలక్కాయిడ్ వాసి. 2018లో ఆహారం దొంగిలించాడన్న నెపంతో స్థానికులు అతడిని కట్టివేసి గంటలపాటు కొట్టి చంపారు. (ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్)
Comments
Please login to add a commentAdd a comment