
నేహా పాటిల్, ప్రణవ్‌ల వివాహం
కర్ణాటక, యశవంతపుర: కన్నడ చిత్ర రంగానికి చెందిన నటి నేహా పాటిల్ వివాహం వైభవంగా జరిగింది. బెంగళూరు విజయనగరలోని కల్యాణ మంటపంలో ఇంజనీర్ ప్రణవ్‌తో వీరి వివాహం శుక్రవారం జరిగింది. హుబ్లీకి చెందిన నేహా పాటిల్, ప్రణవ్ రిసెప్షన్ గురువారం సాయంత్రం జరిగింది. చిత్రరంగానికి చెందిన దీపికా దాస్, శరణ్య, డైరెక్టర్ మురళీకష్ణతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. గత అక్టోబర్ 19న ప్రణవ్‌తో నిశ్చితర్థాం జరిగింది. 2011లో సినిమా రంగానికి అడుగు పెట్టిన నేహా తిప్పజ్జి సర్కిల్, పారు వైఫ్ ఆఫ్ దేవరాజ్, సంక్రాంతి, సంయుక్త, సితారా, వర్థన్, టైట్లు బేకాలాంటి సినిమాలలో నటించారు. బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్‌లో నటించారు. వివాహం తరువాత నటిస్తారో స్వస్తి చెబుతారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment