Kannada TV Actress: Files Complaint On Her Husband For Torturing Her - Sakshi
Sakshi News home page

Kannada TV Actress: ' పేరుకు హీరో.. అవకాశాల పేరుతో లోబర్చుకున్నాడు'

Nov 12 2021 11:59 AM | Updated on Nov 12 2021 6:41 PM

Kannada TV Actress Files Complaint On Her Husband For Torturing Her - Sakshi

Kannada TV Actress Files Complaint: ప్రముఖ కన్నడ సీరియల్‌ నటి( పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) ఓ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. 'కొన్నాళ్ల క్రితం సోషల్‌ మీడియా ద్వారా కలుసుకున్నాం. అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పలుమార్లు ఇంటికి వచ్చి బలవంతంగా నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పెళ్లికి ముందు పలుమార్లు నాపై అత్యాచారం చేశాడు.

ఆ తర్వాత వివాహం గురించి మాట్లాడితే ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు. స్నేహితులు కూడా ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు గుడిలో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అత్తిరింట్లో భర్త తరపు బంధువులు నరకం చూపించారు.  కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ నా కులం పేరుతో దూషించేవారు' అని నటి బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ప్రస్తుతం తాను భర్త, అ‍త్తమామల చిత్రహింసలు భరించలేక ఇటీవలె వాళ్ల నుంచి విడిగా ఉంటున్నట్లు తెలిపింది. ఇటీవలె ఈమె ఓ రియాలిటీ షోలో సైతం పాల్గొంది. ప్రస్తుతం ఆమె భర్త సీరియల్స్‌లో హీరోగా చేస్తున్నాడు. అయితే వివరాలు మీడియాకు వెల్లడించడానికి ఆమె నిరాకరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement