ప్రముఖ హీరోయిన్ చేదు అనుభవం ఎదురైంది. సొంత భాషలో మాట్లాడినందుకు ఏకంగా బూతులు తిట్టారు. మెడలోని బంగారు గొలుసు కూడా లాగేసే ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల ముందు జరిగిన ఈ సంఘటన గురించి సదరు హీరోయిన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అసలేం జరిగిందో అనేది విడమరిచి మరీ చెప్పింది. ప్రస్తుతం ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.
కర్ణాటకకు చెందిన నటి హర్షిక పునాచ.. 2008 నుంచి సినిమాలు చేస్తోంది. తెలుగులోనూ 'ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడలా ఇప్పుడిలా' తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కొంకణి, భోజ్‌పురి, కొడవ భాషా చిత్రాల్లో నటించింది.
(ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?)
నటుడు భువన్ పొన్నానని గతేడాది పెళ్లి చేసుకున్న హర్షిక.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని ఆస్వాదిస్తోంది. తాజాగా బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లి తిరిగొస్తుండగా ఊహించని సంఘటన ఎదురైందని, కొందరు వ్యక్తులు తమ కారుని అడ్డగించి దాడి చేశారని.. తన భర్త మెడలో బంగారు గొలుసు లాగేయబోయరని చెప్పుకొచ్చింది.
'ఇద్దరు వ్యక్తులు సడన్ గా డ్రైవర్ సీటు దగ్గరకొచ్చి కారు చాలా పెద్దగా ఉందని, స్టార్ట్ చేస్తే తమకు తగులుద్ది అని గొడవ మొదలుపెట్టారు. నా భర్త కన్నడలో సరేలే జరగమని వాళ్లతో అన్నాడు. అయితే ఈ కన్నడ వాళ్లకు బుద్ది చెప్పాలని, అవసరమైతే ముఖంపై గుద్ది చెప్పాలని వాళ్లు హిందీలో అన్నారు. పదే పది నిమిషాల్లో 20-30 మంది మా కారు చుట్టుముట్టారు. వీళ్లలో ముగ్గురు నా భర్త మెడలోని బంగారు గొలుసు లాగేయాలని ప్రయత్నించారు. ఇది గ్రహించిన నా భర్త.. గొలుసు నాకు ఇచ్చేశారు. వాళ్లతో మేం కన్నడలో మాట్లాడమే తప్పైపోయింది. దీని గురించి కంప్లైంట్ చేయాలని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఓ ఏఎస్ఐ మమ్మల్ని అసలు పట్టించుకోలేదు' అని హర‍్షిక చెప్పుకొచ్చింది. ఓ వీడియోని కూడా పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు)
Comments
Please login to add a commentAdd a comment