‘కాఫీడే’... నా జీవితాన్ని మలుపు తిప్పింది! | Harshika Poonacha at Appudala Ippudila Movie Promotions | Sakshi
Sakshi News home page

‘కాఫీడే’... నా జీవితాన్ని మలుపు తిప్పింది!

Published Wed, Mar 30 2016 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

‘కాఫీడే’... నా జీవితాన్ని మలుపు తిప్పింది!

‘కాఫీడే’... నా జీవితాన్ని మలుపు తిప్పింది!

- హర్షికా పూనచ్చా
 ‘‘కన్నడంలో ఇప్పటివరకూ 12 సినిమాలు చేశాను. పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ వంటి సూపర్‌స్టార్స్‌తో నటించా. తెలుగులో నాకిది తొలి సినిమా. రిలీజ్ దగ్గరవుతుంటే నెర్వస్‌గా ఉంది’’ అని నాయిక హర్షిక అన్నారు. కె.ఆర్.విష్ణు దర్శకత్వంలో సూర్య, హర్షికా పూనచ్చా జంటగా పుల్లరేవు రామచంద్రారెడ్డి, కల్యాణ్ ధూళిపాళ సమర్పణలో ప్రదీప్‌కుమార్ జంపా నిర్మించిన చిత్రం ‘అప్పుడలా...ఇప్పుడిలా’. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హర్షిక మాట్లాడుతూ- ‘‘నేను పుట్టింది, పెరిగింది బెంగళూరులోనే.
 
  నిజం చెప్పాలంటే, నేను హీరోయిన్‌ని అవుతానని కలలో కూడా అనుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగింది. టెన్త్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్‌తో కలిసి ‘కాఫీడే’కి వెళ్లాను. అక్కడికి ఓ సినిమా డెరైక్టర్ వచ్చి నన్ను చూసి, ‘యాక్ట్ చేస్తావా?’ అని సడన్‌గా అడిగారు. మొదట షాక్ అయ్యాను. కానీ తర్వాత కథ నచ్చి, వెంటనే ఒప్పుకున్నా. అలా ‘కాఫీడే’ నా జీవితాన్ని మలుపుతిప్పింది. 15 ఏళ్ల వయసులో సినిమాల్లోకొచ్చా. కానీ, చదువు కొనసాగిస్తూనే, సినిమాల్లో కూడా నటించాను. గత ఏడాదే నా ఇంజినీరింగ్ పూర్తయింది.
 
 ఇక నుంచి పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్న సమయంలోనే ఈ తెలుగు ఛాన్స్ వచ్చింది. తెలుగులో అందరి సినిమాలూ చూస్తుంటా. ముఖ్యంగా పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు సినిమాలంటే చాలా ఇష్టం. ఈ చిత్ర నిర్మాత ప్రదీప్‌కుమార్ జంపా నా సినిమాలు చూసి నన్నీ చిత్రానికి రికమెండ్ చేశారు. అప్పుడే దర్శకుడు విష్ణు ఈ కథ చెప్పడం, ఆ కథ బాగా నచ్చడంతో  మొదటిసారి తెలుగులో నటించ డానికి ఒప్పుకున్నాను.
 
   ఈ సినిమాలో నేను రిచ్‌గాళ్‌గా కనిపిస్తాను. ఇందులో సీనియర్ నరేశ్ నాకు తండ్రి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో క్యారెక్టర్ నా నిజజీవిత స్వభావానికి దగ్గరగా ఉంటుంది. కానీ నా పాత్ర పేరు సస్పెన్స్. ఈ సినిమా చిత్రీకరణప్పుడే తెలుగు మాట్లాడటం నేర్చేసుకున్నా. నా నెక్స్ట్ సినిమాకు తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నా’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement