కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డిని కడప జిల్లా పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గంగిరెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు కడప రిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం గంగిరెడ్డి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.