gangireddy
-
ఎర్ర గంగిరెడ్డి తో అవినాష్ రెడ్డి వాట్సాప్ చాట్?
-
ఈసీ గంగిరెడ్డికి నివాళులర్పించిన వైఎస్ భారతి
-
వివేకా కేసు: గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నం!
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఏ1 ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు వివేకా కూతురు సునీత ప్రయత్నించారు. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లిన సునీత.. గంగిరెడ్డిని కలిసేందుకు యత్నించారు. గంగిరెడ్డిని కలవాలంటూ జైలు అధికారులను ఆమె రిక్వెస్ట్ చేశారు. అయితే అనుమతించలేమని జైలు అధికారులు స్పష్టం చేయడంతో చివరకు సునీత లాయర్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే కొన్ని పేపర్లపై గంగిరెడ్డితో సునీత లాయర్ సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. ఒకవైపు వివేకా హత్య కేసులో దస్తగిరి బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్లో సునీత జోక్యం చేసుకున్నారు. కృష్ణారెడ్డి పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దంటూ సునీత కోర్టును కోరారు. కృష్ణార్డెడ్డి ఈ కేసులో బాధితుడి కాదని, అందుచేత అతని పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని సునీత వాదన. ఈ నేపథ్యంలో గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
వివేకాపై కక్ష గట్టింది ఆ ఇద్దరే..
సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డికి ఆయన ఇద్దరు బావమరుదులు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి నుంచే ముప్పు ఉండేది. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం వారే ఆయనపై కక్షగట్టారు’.. అని వివేకానందరెడ్డి రెండో భార్య షేక్ షమీమ్ స్పష్టంచేశారు. ‘వివేకానందరెడ్డి హత్య తరువాత శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఎర్ర గంగిరెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారు’ అని కూడా ఆమె తేల్చిచెప్పారు. ఈ హత్య కేసులో షమీమ్ 2020 అక్టోబరులోనే సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డితో తన రెండో వివాహం.. దానిపై ఆయన కుమార్తె సునీత, అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఎంతగా విభేదించింది.. తనను ఎంతగా బెదిరించిందీ.. వివేకానందరెడ్డిని ఎంతగా వేధించింది మొదలైన సంచలనాత్మక విషయాలను ఆమె సవివరంగా తన వాంగ్మూలంలో వెల్లడించారు. షేక్ షమీమ్ వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలు ఆమె మాటల్లోనే.. మా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు వైఎస్ వివేకానందరెడ్డి నన్ను 2010లో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. మేం పెళ్లి చేసుకోవడాన్నే వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత నాకు ఫోన్‌చేసి తీవ్రంగా బెదిరించారు. శివప్రకాశ్‌రెడ్డి మా బావగారికి ఫోన్‌చేసి తీవ్రంగా దూషించారు. దీంతో ఆయన కుటుంబం పులివెందుల వదిలివెళ్లిపోయింది. ఈ విషయాన్ని నేను వివేకానందరెడ్డికి చెప్పాను. దాంతో ఆయన శివప్రకాశ్‌రెడ్డి దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని మరీ మండిపడ్డారు. షమీమ్‌ను తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. ఆమె నా భార్యని స్పష్టంచేశారు. అయినాసరే.. శివప్రకాశ్‌రెడ్డి మాత్రం వివేకా మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. మమ్మల్ని బెదిరిస్తూనే వచ్చారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసమే కక్ష 2013 నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిల నుంచి నాకు వేధింపులు ఎక్కువయ్యాయి. 2014లో మాకు బాబు పుట్టాడు. షేర్ షా అనే పేరుపెట్టాం. మా కుమారుడికి ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేకానందరెడ్డి చెప్పారు. దాంతో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిలలో ఆందోళన మొదలైంది. వివేకానందరెడ్డికి మొదటి భార్యతో కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుడిని కావాలని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టుదలగా ఉండేవారు. కానీ, మాకు పుట్టిన బిడ్డను వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడంతో వారిద్దరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివేకానందరెడ్డిని మా ఇంటికి రాకుండా కట్టడి చేసేందుకు యత్నించేవారు. ఆయన్ను కూడా తీవ్రంగా బెదిరించేవారు. ఆ నాలుగెకరాలను శివప్రకాశ్‌రెడ్డి రాయించుకున్నారు.. బెరైటీస్ గనులు ఉన్న నాలుగెకరాల భూమిని నా కుమారుడి పేరున రాయాలని వివేకానందరెడ్డి భావించారు. కానీ, అందుకు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ భూమిని శివప్రకాశ్‌రెడ్డి తన పేరున రాయించేసుకున్నారని వివేకానందరెడ్డే నాకు చెప్పి బాధపడ్డారు. అప్పటి నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిల నుంచి నాకు బెదిరింపులు మరింత తీవ్రమయ్యాయి. వివేకాకు ఆర్థిక ఇబ్బందులు.. ఆయన్ని ఒంటరిని చేశారు.. వివేకానందరెడ్డిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించారు. ఆయన్ని ఒంటరిగా పులివెందులలో విడిచిపెట్టి కుటుంబసభ్యులు అందరూ హైదరాబాద్‌లో ఉండేవారు. దాంతో రోజువారి ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు పడేవారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018లో విక్రయించారు. రూ.8 కోట్లు ఇస్తానన్నారు.. బెంగళూరులో ఓ భూ సెటిల్మెంట్ ద్వారా రూ.8 కోట్లు వస్తాయని వాటిని నాకు ఇస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. కడపలోగానీ హైదరాబాద్‌లోగానీ ఓ ఇల్లు కొనిస్తానని.. మా కుమారుడిని బాగా చదివిస్తానని చెప్పారు. ఇది వివేకానందరెడ్డి స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి ద్వారా నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డికి తెలిసే అవకాశం ఉంది. గంగిరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వారిద్దరూ కుట్ర ప్రకారం వివేకానందరెడ్డి చుట్టూ తమ మనుషులనే పెట్టారు. దస్తగిరితోపాటు అందరూ వాళ్ల మనుషులే. హైదరాబాద్‌లో నేను ఉంటున్న ఇంటి అడ్రస్ కూడా దస్తగిరికి తెలియకుండా వివేకానందరెడ్డి జాగ్రత్తపడేవారు. ఓసారి దస్తగిరి మామిడిపళ్లు పట్టుకుని హైదరాబాద్ వస్తే.. మా ఇంటికి కాకుండా మరోచోట అప్పగించమని చెప్పారు. దస్తగిరి నుంచి నాకు ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చేశారు. వివేకానందరెడ్డి హత్య తరువాత శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఎర్ర గంగిరెడ్డి ఆధారాలను ధ్వంసం చేశారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని బెడ్రూమ్ నుంచి హాలులోకి తేవడం, ఆధారాలను ధ్వంసం చేయడం అంతా దగ్గరుండీ చేయించింది ఎర్ర గంగిరెడ్డే. శివప్రకాశ్‌రెడ్డి చెప్పడంతోనే ఆయన అలా చేశారు. భయంతోనే వెళ్లలేదు.. 2019, మార్చి 15న ఉ.10గంటల సమయంలో వివేకానందరెడ్డి మరణించారని నాకు తెలిసింది. వెంటనే మా చెల్లితో కలిసి పులివెందుల వెళ్లాలని అనుకున్నా. కానీ, శివప్రకాశ్‌రెడ్డికి భయపడే వెళ్లలేదు. ఎందుకంటే 2012లో ఓసారి వివేకానందరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు ఆయన్ని చూసేందుకు ఇంటికి వెళ్తే నన్ను శివప్రకాశ్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా బయటకు బలవంతంగా గెంటేశారు. అందుకే 2019లో ఆయన హత్యకు గురైనా సరే పులివెందుల వెళ్లేందుకు సాహసించలేకపోయాను. ఐఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వివేకానందరెడ్డి 2017లో ఒక ఐఫోన్ కొని నాకు ఇచ్చారు. 2019లో ఆయన హత్యకు గురైన తరువాత పోలీసులు వచ్చి ఆ ఐఫోన్‌ను తీసుకెళ్లిపోయారు. దానిపై నాకు ఎలాంటి రశీదు కూడా ఇవ్వలేదు. నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే ఆ ఫోన్‌ను పోలీసుల ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారేమోనని ఆ అనుమానం. -
ఎర్ర గంగిరెడ్డిదే కీలక పాత్ర.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించింది. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూర్ సుమలత గురువారం విచారణ జరిపారు. సీబీఐ తరఫున పీపీ నాగేంద్రన్ వాదనలు వినిపిస్తూ.. ‘గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. వివేకా వద్ద డ్రైవర్‌గా పనిచేస్తానని, హత్య చేయలేనని చెప్పినా గంగిరెడ్డి రూ.40 కోట్లు ఇస్తానని ఆశ చూపాడని దస్తగిరి (ఏ–2) వాంగ్మూలంలో వెల్లడించాడు. పథకం ప్రకారం ముందుగా వివేకా ఇంటికి వెళ్లిన గంగిరెడ్డి.. ఆ తర్వాత ముగ్గురు నిందితులు లోపలికి వచ్చేందుకు సహకరించాడు. గంగిరెడ్డి ఆదేశాలతోనే హత్యను వేరేవాళ్లపై నెట్టేలా చావుబతుకుల్లో ఉన్న వివేకా లేఖ రాశారు. అతని విచారణ తప్పనిసరి. వివేకా హత్య జరిగిన రోజు వాచ్మెన్ రంగన్న ఇతర నిందితులతో పాటు గంగిరెడ్డిని కూడా గుర్తించాడు. హత్య తర్వాత గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి సాక్ష్యాలను చెరిపివేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలి’ అని వాదించారు. చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు? డీఫాల్ట్ బెయిల్‌ను మెరిట్ ఆధారంగా పరిశీలించి రద్దు చేయవచ్చని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపించారు. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని గంగిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వెల్లడించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను కడప కోర్టు, ఏపీ హైకోర్టు కొట్టివేశాయని చెప్పారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదన్నారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు. దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు (ఏ–4) షేక్ దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దస్తగిరిని అప్రూవర్‌గా పేర్కొంటూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొట్టివేయాలంటూ ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. భాస్కర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిస్తూ.. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కిరాయి హంతకుడు దస్తగిరికి క్షమాబిక్ష చెల్లదని అన్నారు. ఈ పిటిషన్లలో ప్రతివాది అయిన దస్తగిరికి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో నిందితుడు దస్తగిరికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేశారు. -
ఆ వివరాలన్నీ మా ముందుంచండి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి కింది కోర్టు ఎప్పుడు బెయిల్ ఇచ్చింది? దాన్ని రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడు పిటిషన్ వేసింది? ఆ పిటిషన్‌ను కింది కోర్టు ఎప్పుడు కొట్టేసింది? గంగిరెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఇచ్చిన వాంగ్మూలాలు తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీచేశారు. గంగిరెడ్డికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రాయ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది ఎ.చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. బెయిల్‌పై బయట ఉన్న గంగిరెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని చెప్పారు. వివేకా హత్య వెనుక రాజకీయ పెద్దల ప్రమేయం ఉందన్నారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం సైతం ఇచ్చారని తెలిపారు. సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలం ఇస్తానని మొదట చెప్పిన సీఐ శంకరయ్య, గంగాధర్‌రెడ్డి, కృష్ణారెడ్డిలు గంగిరెడ్డి, అతడి అనుచరులు బెదిరించడంతో 164 వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. గంగిరెడ్డి బయట ఉంటే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ వాదనలను గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు తోసిపుచ్చారు. సీబీఐవి కేవలం ఆరోపణలు మాత్రమేనన్నారు. గంగిరెడ్డి సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు లేవన్నారు. శంరయ్య తదితరులు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరిస్తే దానికీ గంగిరెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. బెయిల్ రద్దుకోసం సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తివివరాలు తమముందు ఉంచాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
మాదాపూర్ అడిషినల్ డీసీపీపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు ఉన్న వీడియో టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. యోగి ఈ వివాదంపై ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన తాను ఆమెను వేదించలేదని.. కేవలం పది వేల రూపాయల విషయంలో జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలిపాడు. అదే సమయంలో డీసీపీ గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను తాను రిలీజ్ చేయలేదని ఆ వీడియో కూడా హారికనే షూట్ చేసిన తన మిత్రులకు షేర్ చేసిందని చెప్పారు. -
‘కార్’కు ఏడీసీపీ గంగిరెడ్డి బదిలీ
సాక్షి, హైదరాబాద్: ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు టీవీ చానళ్లలో వచ్చింది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. -
డోన్ కోర్టుకు హాజరైన గంగిరెడ్డి
డోన్ టౌన్ : ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని మంగళవారం కడప పోలీసులు డోన్ కోర్టులో హాజరుపరిచారు. పలు కేసుల్లో నిందితుడైన ఇతను.. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. డోన్‌లో గతేడాది ఎర్రచందనం పట్టుబడిన కేసులో నిందితుడిగా ఉన్నందున కడప నుంచి పోలీస్ బందోబస్తు మధ్య డోన్‌కు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త మృతి
నంబులపూలకుంట : నంబులపూలకుంట మండలం టి.ఎన్.పల్లి సర్పంచు గుట్టలసందు వెంకట్రామిరెడ్డి తండ్రి, వైఎస్సార్ సీపీ కార్యకర్త గంగిరెడ్డి(45) చిత్తూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ఫ్రమాదంలో మరణించార ని బంధువులు తెలిపారు. వారి కథనం ప్రకారం... బోయకొండమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొని తిరిగి బైక్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్ అదుపు తప్పింది. ఘటనలో గంగిరెడ్డి తలకు తీవ్ర గాయం కావడంతో స్పహతప్పి పడిపోయారు. వెంటనే తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. మతునికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
భారీగా మత్తు ఇంజక్షన్ల పట్టివేత
పార్వతీపురం : ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న మత్తు ఇంజక్షన్లను పార్వతీపురం పోలీసులు పట్టుకున్నారు. విశాఖకు చెందిన గంగిరెడ్డి గణేష్ అనే వ్యక్తి మత్తు ప్రేరేపిత ఫోర్ట్విన్ అనే సుమారు 500 వయల్స్‌ను తీసుకుని ఒడిశాలోని రాయగఢ్ నుంచి బయలుదేరాడు. ఆయన గురువారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా పార్వతీపురం బస్టాండ్ వద్ద ఉండగా పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో గణేష్ వద్ద ఉన్న మత్తు కలిగించే వయల్స్‌ను గుర్తించారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఓ యువతి అతడికి ఫోన్ చేసింది. మత్తు ఇంజక్షన్లు ఇంకా ఎందుకు పంపించలేదని ప్రశ్నించింది. ఈ సంభాషణను కూడా విన్న పోలీసులు గణేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడ్డ ఇంజక్షన్ల విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. -
ఎంహెచ్‌ఓగా గంగిరెడ్డి...?
అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థ ప్రజావైద్యాధికారి (మెడికల్ హెల్త్ ఆఫీసర్–ఎంహెచ్ఓ)గా గంగిరెడ్డి నియమితులయ్యే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న డాక్టర్ గంగాధరరెడ్డి సొంతశాఖ అయిన వైద్య ఆరోగ్యశాఖకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రిలీవ్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శానిటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న గంగిరెడ్డికి ఎంహెచ్ఓ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
కంప చెట్లలో తపంచా
ఉపాధి హామీ పనుల్లో భాగంగా కంప చెట్లు తొలగిస్తున్న కూలీలకు ఎప్పటిదో గానీ పాత కాలంనాటి ఓ తపంచా కనిపించింది. నల్లగొండ జిల్లా గుండాల మండలం పల్లెపాడు గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఈజీఎస్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రామన్నపేట సీఐ గంగిరెడ్డి గ్రామానికి చేరుకుని తపంచాను స్వాధీనం చేసుకున్నారు. దానిపైన కెనాన్ అని ఇంగ్లిష్‌లో పేరు ఉంది. -
ఆ పిచ్చి మోజులో పడి..
తాడిపత్రి(అనంతపురం): క్రికెట్ బెట్టింగ్‌లతో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామానికి చెందిన గంగిరెడ్డి అనే వ్యక్తికి క్రికెట్ బెట్టింగ్ పిచ్చి ఉంది. ఇటీవల పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. అతనికి రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. రుణ దాతల ఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారే అతడిని అపహరించారని కుటుంబసభ్యులు పోలీసులను కూడా ఆశ్రయించారు. అయితే, అతడు కర్నూలు జిల్లా బనగానిపల్లె మండలం యాగంటి వద్ద పురుగుల మందుతాగి చనిపోయాడు. అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు శనివారం రాత్రి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
చంద్రబాబు నుంచి నా భర్తకు ప్రాణహాని
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, ఎన్కౌంటర్ పేరుతో మట్టుపెట్టేందుకు కుట్ర జరుగుతోందని కొల్లం గంగిరెడ్డి సతీమణి కొల్లం మాళవిక ఆరోపించారు. తన భర్తను కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆమె తాజాగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జైల్లో ఉన్న తన భర్తకు తగిన రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని, చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల ఎస్పీలు, కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమలరావు, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. చంద్రబాబు కక్ష పెంచుకున్నారు వ్యాపారవేత్త అయిన తన భర్త కొల్లం గంగిరెడ్డిని రాజకీయ కారణాలతో అన్యాయంగా కేసుల్లో ఇరికించారని మాళవిక తన పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో తన భర్తను ఇరికించారని, అయితే కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తన భర్తపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందులో భాగంగానే గతేడాది మేలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారని తెలిపారు. మా కుటుంబ సభ్యులనూ తప్పుడు కేసుల్లో ఇరికించారు ‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నా భర్తను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. నా భర్తపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఆ కేసులు జరిగే సమయానికి ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా తప్పుడు కేసులు బనాయించారు. నా భర్తను మాత్రమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా తప్పుడు కేసుల్లో ఇరికించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రత్యక్షంగా నా భర్తపై కేసులు పెట్టేందుకు ఆధారాలు లేకపోవడంతో సహ నిందితులు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా కేసులు పెడుతున్నారు. ఎన్కౌంటర్ పేరుతో ఆయనను అంతమొందించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జైల్లో గానీ, కోర్టులకు తీసుకొచ్చే దారిలోగానీ హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఈ నెల 20న గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశాను. పోలీసులు నా భర్తను ఎర్ర చందనం స్మగ్లర్‌గా చిత్రీకరిస్తూ, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయనపై 28 కేసులున్నట్లు ఈ నెల 15న మీడియా సమావేశంలోప్రకటించారు. తన ప్రాణాలను కాపాడాలని నా భర్త కోరారు. కాబట్టి ఆయనను ప్రస్తుతం ఉన్న కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఆదేశాలు ఇవ్వాలి. తనకు ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు నా భర్త చేత బలవంతంగా చెప్పించారు. ఈ విషయాన్ని ఆయనే నాకు చెప్పారు. నా భర్తను మారిషస్ నుంచి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రధానమంత్రి కార్యాలయ జోక్యాన్ని కూడా కోరారు. డీజీపీ, సీఐడీ అదనపు డీజీలు ముఖ్యమంత్రి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. అందులో భాగంగా మీడియా పరేడ్ నిర్వహించారు. ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని తెలిసినా చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి’’ అని కొల్లం మాళవిక తన పిటిషన్లో విన్నవించారు. -
పిస్టల్ చూపించి బెదిరించారు
* అందుకే నా భర్త ప్రాణహాని లేదని చెప్పారు * లేదంటే భార్యాపిల్లలను మళ్లీ చూడలేవన్నారు * గంగిరెడ్డి భార్య మాళవిక ఆరోపణ * కక్షసాధింపుతోనే తప్పుడు కేసులు పెట్టారు * ఆయనపై ఉన్నవి రెండు కేసులే.. * ఇపుడు ఏకంగా చంపాలని చూస్తున్నారు * ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలపై పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డికి టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను ఎన్కౌంటర్ చేస్తారని భయంగా ఉందన్నారు. మారిషస్ నుంచి తరలిస్తుండగా గంగిరెడ్డిని పోలీసులు పిస్టల్‌తో బెదిరించి భయపెట్టటంతో ప్రాణహాని లేదని మీడియాకు చెప్పారని తెలిపారు. తన భర్త ప్రాణాలను కాపాడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తన భర్తకు ఏదైనా అయితే అందుకు చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. శనివారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కక్షసాధింపుతోనే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. బెదిరించి చెప్పించారు 'నా భర్తను మారిషస్ నుంచి తీసుకొచ్చే మార్గంలో పిస్టల్‌తో బెదిరించారు. వారు చెప్పినట్లు చెప్పకపోతే భార్య, పిల్లలను కూడా చూసుకోలేవంటూ భయపెట్టారు. అందుకనే మొన్న మీడియాతో మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రాణహానీ లేదని చెప్పారు. కానీ నేను జైలుకు వెళ్లి ఆయన్ను కలిస్తే తాను ఎందుకలా చెప్పాల్సి వచ్చిందో వివరించారు. పిస్టల్‌తో బెదిరించారు. మిమ్మల్ని మళ్లీ చూస్తానో లేదోనన్న భయంతో అలా చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. ఇటీవల బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది అమాయకులను తీసుకువచ్చి అడవిలో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఆయన్ను కూడా అలా చేస్తారని భయంగా ఉంది. పారిపోతున్నారు.. పారిపోతున్నారు అని పదేపదే చెబుతున్నారు. కానీ మా ఆయన పారిపోవడం లేదు. కోర్టు ఎలాంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాకు అనుమానాలున్నాయి. అందుకే మీడియా ద్వారా గవర్నర్‌గారికి విజ్ఞప్తి చేసుకునేదేమిటంటే... మేం మీ దగ్గరకు వచ్చి లేఖ ఇచ్చేంత శక్తి కలిగిన వాళ్లం కాదు సార్.. నా మాటలను మీరు పరిగణనలోకి తీసుకుని నా భర్తకు ఎలాంటి హానీ లేకుండా సురక్షితంగా ఉండేటట్లు చూడాలని కోరుతున్నాను... జైలులో ఆయనను ఏమన్నా చేస్తారన్న అనుమానాలు ఉండబట్టే నేను ఇలా మీడియా ముందుకు రావలసి వచ్చింది. జైలులో గానీ, కోర్టుకు తీసుకెళ్లే సమయంలో గానీ, ఆహారం ద్వారా గానీ దేనిద్వారా అయినా ఆయనకు హాని జరిగితే అందుకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలి.. నాడు చంద్రబాబే తెలియదని చెప్పలేదా? అలిపిరి ఘటనలో 2003లో మా ఆయన్ను ఇంటరాగేషన్ పేరుతో తీసుకెళ్లి చాలా హింసించారు. మానసికంగానే కాదు శారీరకంగానూ హింసించారు. ఇప్పుడు కూడా కస్టడీకి తీసుకునేటపుడు గానీ, వాయిదాలకు తీసుకెళ్లే మార్గమధ్యంలో గానీ ఎన్కౌంటర్ చేస్తారని భయంగా ఉంది. అలిపిరి ఘటనలో నా భర్త ప్రమేయమున్నదన్న వార్తలు అవాస్తవం. ఆనాటి చానళ్ల వార్తలు గానీ, పేపర్ల వార్తలు గానీ చూడండి. ఎక్కడా నా భర్త పేరు లేనేలేదు. మా ఆయన అంతటివాడు కాదు. కేవలం కక్ష సాధించడానికే ఈ కేసులు పెట్టారు. ఆనాడు చంద్రబాబు స్వయంగా కోర్టుకు వెళ్లి ఈయనెవరో తనకు తెలియదని చెప్పారు కూడా. రెండే కేసులు.. మిగిలినవన్నీ కక్షపూరితం.. డీజీపీ రాముడుగారు గంగిరెడ్డిపై 28 కేసులున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ఆయనపై రెండే కేసులున్నాయి. వాటిలో ఒక కేసులో శిక్ష అనుభవించారు. కానీ ఆయనను మారిషస్ నుంచి తీసుకురావడం కోసం రద్దయిపోయిన కేసులో ప్రత్యేకంగా జీవో జారీ చేసి అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఇవన్నీ కక్షపూరిత చర్యలు కావా.. అందుకనే మాకు అనుమానాలున్నాయి. ఆయన బెరైటిస్ ఎక్స్పోర్ట్ పర్మిషన్ల కోసం దుబాయి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. ఆ తర్వాత లుక్ అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దానివల్ల భయపడి ఆయన అక్కడ ఉండి ఉండవచ్చు కానీ పారిపోయే ఉద్దేశం ఆయనకు లేదు. ఆయనపై మోపిన కేసులకు ఆయనకు సంబంధం లేదు. అందుకు అనేక ఉదాహరణలు చెప్పగలను. ఆయన దుబాయిలో ఉన్నారని అన్ని మీడియాలలో వచ్చింది. కానీ ఆయన కోడూరు తాలూకా ఓబుళవారిపల్లిలో దగ్గరుండి ఎర్రచందనం మోయిస్తున్నారని కేసులు పెట్టారు. చంద్రబాబునాయుడి మెప్పు పొందడం కోసమే పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. రాజకీయంగా కక్షసాధించేందుకే.. మొదటి నుంచి మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 1992 నుంచి మాపై కక్షసాధిస్తున్నారు. 2003లోనూ, 2014లోనూ ఎన్నికల ముందు ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా తాతగారైన పెంచలరెడ్డిగారు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1981 వరకు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1982లో మా బావగారైన బ్రహ్మానందరెడ్డిగారు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మండలాధ్యక్షుడిగా, డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కోడూరు తాలూకా పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. మా తండ్రిగారైన బాబుల్‌రెడ్డి పుల్లంపేట ప్రెసిడెంట్ కాగా, మా అమ్మగారు అనాసంద్రం ప్రెసిడెంట్. మాది పూర్తిగా రాజకీయ కుటుంబం. అందుకే టీడీపీవారు కక్షసాధిస్తున్నారు. మాకు వేల కోట్ల ఆస్తులా..? నాటుసారా కాసి ఈ స్థితికి ఎదిగామని ఆరోపిస్తున్నారు. కానీ అది సరికాదు. మాకు వేల కోట్ల ఆస్తులున్నాయన్నది కూడా వట్టిమాట. వ్యవసాయ కుటుంబం మాది. 2000 సంవత్సరం నుంచి సాయిబాలాజీ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఉంది. మా ఆస్తి మూడునాలుగు కోట్లుంటుంది. అది కూడా కన్స్ట్రక్షన్స్ కంపెనీలో వర్క్‌లు చేశాం. హెచ్ఆర్ పల్వరైజింగ్ మిల్లు ఉంది. లీజుకు తీసుకున్న పెట్రోల్ బంక్ ఉంది. అంతేకానీ నాటుసారా కాసేంత దుస్థితిలో మేం లేం.'అని మాళవిక వివరించారు. -
గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డిని కడప జిల్లా పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గంగిరెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు కడప రిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం గంగిరెడ్డి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
హైదరాబాద్‌కు గంగిరెడ్డి తరలింపు
హైదరాబాద్: ఎర్ర చందనం సహా పలు కేసుల్లో నిందితునిగా ఉన్న కొల్లం గంగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గంగిరెడ్డిని మారిషస్‌లో అరెస్ట్ చేశామని చెప్పారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అతనిపై కేసులు ఉన్నట్టు డీజీపీ వెల్లడించారు. ఆదివారం ఉదయం గంగిరెడ్డిని మారిషస్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మారిషస్ పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డిని శనివారం సాయంత్రం ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. అక్కడి పోలీసులు గంగిరెడ్డిని ఆయనకు అప్పగించారు. -
గంగిరెడ్డి అరెస్ట్.. మీడియా వెల్లడించిన డీజీపీ
-
ఏపీ పోలీసుల అదుపులో గంగిరెడ్డి
సీఐడీ చీఫ్‌కు అప్పగించిన మారిషస్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఎర్ర చందనం సహా పలు కేసుల్లో నిందితునిగా ఉన్న కొల్లం గంగిరెడ్డిని ఎట్టకేలకు ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారిషస్ పోలీసుల అదుపులో ఉన్న అతన్ని శనివారం సాయంత్రం ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. కొన్ని నెలలుగా మారిషస్ పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డిని తమకు అప్పగించాలని కోరుతూ సీఐడీ ఎస్పీలు మూడుసార్లు అక్కడికి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఈసారి సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు స్వయంగా మారిషస్ వెళ్లారు. అక్కడి పోలీసులు గంగిరెడ్డిని ఆయనకు అప్పగించారు. గంగిరెడ్డిని ఆదివారం ఉదయం ఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి సాయంత్రానికి హైదరాబాద్‌కు తీసుకువస్తారని పోలీసువర్గాలు తెలిపాయి. అయితే గంగిరెడ్డికి ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 12 ఏళ్ల కిందట చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబుదాడి కేసులో గంగిరెడ్డిని అన్యాయంగా ఇరికించినా కోర్టు కొట్టివేసిందని తెలిపారు. గతంలో గంగిరెడ్డి ఒకే కేసు ఉన్నప్పటికీ, అతను ప్రాణభయంతో విదేశాలకు పారిపోయాక రాజకీయ కక్షసాధింపుతో చంద్రబాబు అనేక కేసులుపెట్టి వేధిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
’గంగిరెడ్డిని త్వరలో తీసుకొస్తాం’
-
అండగా ఉంటా ధైర్యంగా ఉండండి
-
టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి
లక్కిరెడ్డిపల్లి: వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్త పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని గుటకవానిపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ చెందిన నాయకులు, కార్యర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ చేసిన దాడిలో గంగిరెడ్డి అనే వైఎస్ఆర్ సీపీ కార్యకర్త మృతి అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త పరిస్థితి విషమంగా మారడంతో రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణ కారణంగా గుటకవానిపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలో కార్యకర్త మృతి