భారీగా మత్తు ఇంజక్షన్ల పట్టివేత
Published Thu, Sep 8 2016 2:12 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
పార్వతీపురం : ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న మత్తు ఇంజక్షన్లను పార్వతీపురం పోలీసులు పట్టుకున్నారు. విశాఖకు చెందిన గంగిరెడ్డి గణేష్ అనే వ్యక్తి మత్తు ప్రేరేపిత ఫోర్ట్‌విన్ అనే సుమారు 500 వయల్స్‌ను తీసుకుని ఒడిశాలోని రాయగఢ్ నుంచి బయలుదేరాడు. ఆయన గురువారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా పార్వతీపురం బస్టాండ్ వద్ద ఉండగా పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో గణేష్ వద్ద ఉన్న మత్తు కలిగించే వయల్స్‌ను గుర్తించారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఓ యువతి అతడికి ఫోన్ చేసింది. మత్తు ఇంజక్షన్లు ఇంకా ఎందుకు పంపించలేదని ప్రశ్నించింది. ఈ సంభాషణను కూడా విన్న పోలీసులు గణేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడ్డ ఇంజక్షన్ల విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
Advertisement
Advertisement