ఎర్ర చందనం సహా పలు కేసుల్లో నిందితునిగా ఉన్న కొల్లం గంగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
హైదరాబాద్: ఎర్ర చందనం సహా పలు కేసుల్లో నిందితునిగా ఉన్న కొల్లం గంగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గంగిరెడ్డిని మారిషస్లో అరెస్ట్ చేశామని చెప్పారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అతనిపై కేసులు ఉన్నట్టు డీజీపీ వెల్లడించారు. ఆదివారం ఉదయం గంగిరెడ్డిని మారిషస్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
మారిషస్ పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డిని శనివారం సాయంత్రం ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. అక్కడి పోలీసులు గంగిరెడ్డిని ఆయనకు అప్పగించారు.