ఏపీ పోలీసుల అదుపులో గంగిరెడ్డి | Red Sandalwood Smuggler Gangi Reddy arrested | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసుల అదుపులో గంగిరెడ్డి

Published Sun, Nov 15 2015 9:29 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

ఏపీ పోలీసుల అదుపులో గంగిరెడ్డి - Sakshi

ఏపీ పోలీసుల అదుపులో గంగిరెడ్డి

సీఐడీ చీఫ్‌కు అప్పగించిన మారిషస్ పోలీసులు

సాక్షి, హైదరాబాద్: ఎర్ర చందనం సహా పలు కేసుల్లో నిందితునిగా ఉన్న కొల్లం గంగిరెడ్డిని ఎట్టకేలకు ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారిషస్ పోలీసుల అదుపులో ఉన్న అతన్ని శనివారం సాయంత్రం ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. కొన్ని నెలలుగా మారిషస్ పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డిని తమకు అప్పగించాలని కోరుతూ సీఐడీ ఎస్పీలు మూడుసార్లు అక్కడికి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

అయితే ఈసారి సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు స్వయంగా మారిషస్ వెళ్లారు. అక్కడి పోలీసులు గంగిరెడ్డిని ఆయనకు అప్పగించారు. గంగిరెడ్డిని ఆదివారం ఉదయం ఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి సాయంత్రానికి హైదరాబాద్‌కు తీసుకువస్తారని పోలీసువర్గాలు తెలిపాయి. అయితే గంగిరెడ్డికి ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 12 ఏళ్ల కిందట చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబుదాడి కేసులో గంగిరెడ్డిని అన్యాయంగా ఇరికించినా కోర్టు కొట్టివేసిందని తెలిపారు. గతంలో గంగిరెడ్డి ఒకే కేసు ఉన్నప్పటికీ, అతను ప్రాణభయంతో విదేశాలకు పారిపోయాక రాజకీయ కక్షసాధింపుతో చంద్రబాబు అనేక కేసులుపెట్టి వేధిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement