నంబులపూలకుంట : నంబులపూలకుంట మండలం టి.ఎన్.పల్లి సర్పంచు గుట్టలసందు వెంకట్రామిరెడ్డి తండ్రి, వైఎస్సార్ సీపీ కార్యకర్త గంగిరెడ్డి(45) చిత్తూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ఫ్రమాదంలో మరణించార ని బంధువులు తెలిపారు. వారి కథనం ప్రకారం... బోయకొండమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొని తిరిగి బైక్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్ అదుపు తప్పింది. ఘటనలో గంగిరెడ్డి తలకు తీవ్ర గాయం కావడంతో స్పహతప్పి పడిపోయారు. వెంటనే తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. మతునికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.