క్రికెట్ బెట్టింగ్‌లతో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాడిపత్రి(అనంతపురం): క్రికెట్ బెట్టింగ్‌లతో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామానికి చెందిన గంగిరెడ్డి అనే వ్యక్తికి క్రికెట్ బెట్టింగ్ పిచ్చి ఉంది. ఇటీవల పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. అతనికి రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి.
రుణ దాతల ఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారే అతడిని అపహరించారని కుటుంబసభ్యులు పోలీసులను కూడా ఆశ్రయించారు. అయితే, అతడు కర్నూలు జిల్లా బనగానిపల్లె మండలం యాగంటి వద్ద పురుగుల మందుతాగి చనిపోయాడు. అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు శనివారం రాత్రి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.